పీక్స్ కు చేరిన కేశినేని బ్రదర్స్ విభేదాలు.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు

Publish Date:Jun 13, 2026

Advertisement

విజయవాడ రాజకీయాల్లో  కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి.  మాజీ ఎంపీ కేశినేని  నాని  ప్రస్తుత విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని  చిన్ని మధ్య నడుస్తున్న రాజకీయ వైరం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన సొంత తమ్ముడైన చిన్నిపై కేశినేని నాని ఏకంగా ఈడీకి  ఫిర్యాదు చేశారు. 

గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ..  తమ్ముడు కేశినేని చిన్నితో  వైరం మాత్రం పెరుగుతూనే ఉంది. 

తాజాగా శుక్రవారం (జూన్ 13) కేశినేని చిన్నిపై ఉన్న పలు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నాని ఈడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ఆయన   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా పంపించారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ ఫిర్యాదులో కేశినేని చిన్నిపై నాని అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో చిన్నికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. దీనితో పాటు గత ఎన్నికల సమయంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్లను ఒక్కొక్కటి రూ. 5 కోట్లకు చిన్ని విక్రయించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రగతి నగర్ ప్రాంతంలో 112 ఎకరాల భూమిని కబ్జా చేసి, ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని నాని లేఖలో స్పష్టం చేశారు.

వీటితో పాటు హైదరాబాద్ కేంద్రంగా సాగిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచింగ్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  వేదికగా అక్రమ మైనింగ్,  ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున అవినీతి సంపాదన కూడబెట్టారని నాని సంచలన అంశాలను ప్రస్తావించారు. ఇంతకాలం జరిగిన అక్రమాలు చాలని, తక్షణమే పీఎంఎల్‌ఏ చట్టం కింద సమగ్ర దర్యాప్తు జరిపి ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, బెజవాడ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన అన్నాదమ్ములు ఇలా  దర్యాప్తు సంస్థల దాకా వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఆరోపణలు,  లేఖపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అదలా ఉండగా..  సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది.  కేశినేని చిన్ని  ఫిర్యాదు మేరకు..  2025 ఏప్రిల్ 22న కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో  ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్  అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారనీ..  బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని   ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారంపై గతంలోనే తాను లీగల్ నోటీసులు పంపినప్పటికీ, నాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. పైగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.