Publish Date:Jul 25, 2022
చాలా కాలం క్రితం ఒక మహిళ తన కుమార్తెను స్కూల్లో చేర్చాలని తీసికెళ్లింది. ఇద్దరే బిక్కు బిక్కుమంటూ రావడంతో అక్కడున్న వారు వీలయినంత అనుమానించారు. ఆ చూపులతోనే వేల ప్రశ్నలు వేశారు. ఇదే పరిస్థితి లోపల కూడా ఉంటుందని ఆమె అనుకుంది. ప్రిన్సిపల్ పిలవగానే లోపలికి వెళ్లారు. పిల్ల టెన్త్‌లో చేరాలి, మేము వేరే గ్రామం నుంచి వచ్చామన్నదామె. అన్ని ప్రశ్నలు అయ్యాక ఏదో ఒక ఫామ్ తీసి పూర్తిచేయమన్నారు. అందులో తండ్రిపేరు దగ్గర ఆమె ఆగిపోయింది. క్లర్కు ఆమెనే అనుమానించాడు. ఆమె అతని పేరు రాయడానికి నిరాకరించింది. తండ్రిపేరు తప్పకుండా రాయాలని క్లర్కు పట్టుపట్టాడు. ఆ స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఆమె నిరాకరించింది. అవమానకరంగా భావించి పిల్లని తీసుకుని వెళిపోయింది. వేరే స్కూల్లో చేర్చి బాగా చదివించుకుంది.
ఇక్కడ ప్రశ్నల్లా తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాలన్న నిబంధన. కాలం మారినా తండ్రి పేరు విషయంలో నిబంధనలు మారలేదు. ఇపుడు ఇదే అంశం మీద కేరళ హైకోర్టు అత్యంత కీలక తీర్పు ఇచ్చింది. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు తప్పని సరి కాదు తల్లి పేరును మాత్రమే ఉన్నా చాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. అత్యాచారాలకు గురయిన మహిళలు,విడాకులు తీసుకుని భర్తకు దూరంగా బతుకుతూ పిల్లల్ని పోషిం చుకుంటున్న సింగిల్ మదర్ పట్ల సమాజం వ్యవహరించే తీరు మారాలన్నదే కోర్టు తీర్పు సారాంశం.
ఈ తీర్పులో కేరళ హైకోర్టు జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. అత్యంత కీలక వ్యాఖ్య లు చేశారు. ఇకపై ఎవ్వరు కర్ణుడిలా బాధపడాల్సిన అవసరం లేదనీ, అవమానాలు భరించాల్సిన పనిలేదన్నారు. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ప్రతి అమ్మకూ ఉంటుందని స్పష్టం చేసారు. సమాజంలో అవివాహిత మహిళలు, అత్యాచార బాధితుల పిల్లలకు ఎదురవుతున్న బాధలను గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.
ఇంకా కోర్టు పలు వ్యాఖ్యలు సింది. తండ్రి ఎవరో తెలియనందుకు జీవితాంతం దూషణలకు గురైన మహాభారతంలోని కర్ణుడి లాంటివారు మన సమాజంలో ఎవరూ ఉండకూడదని ఆకాంక్షిస్తున్నామని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కర్ణుడు వంటి పాత్రలు లేని సమాజం మనకు కావాలి అని పేర్కొంది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి తండ్రి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన ఓ రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తల్లిపేరును మాత్రమే పేర్కొంటూ గుర్తింపు పత్రాన్ని జారీచేయాలని అధికారులను ఆదేశించారు.
అవివాహిత మహిళల పిల్లు కేవలం ఆమె పిల్లలే కాదనీ, ఈ మహోన్నత భారత దేశం బిడ్డలని..వారు కూడా ఈ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని సుస్పష్టం చేశారు. వారి గోప్యత, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kerala-hi-court-judgement-fathet-name-not-compusury-in-childs-identity-39-140526.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.