మృత్యు కుహరాలుగా బాణాసంచా తయారీ కేంద్రాలు

Publish Date:Apr 22, 2026

Advertisement

 

బాణాసంచా తయారీ కేంద్రాలు ..మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఏపీ, తమిళనాడు, కేరళ.. ఇలా ప్రాంతమేదైనా పేలుళ్లు పరిపాటిగా మారుతూ.. అతి సామాన్యుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. పండుగ సందర్బాల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మాల్సిన ఫైర్ క్రాకర్స్.. ఇప్పుడు కాలిపోయిన కార్మికుల శవాలకు సాక్ష్యమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యంతో.. అభాగ్యులైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కేరళలో 13 మంది, తమిళనాడులో 20 మంది, ఆంధ్రప్రదేశ్‌లో పదుల సంఖ్యలో కార్మికుల మరణాలు.. కేవలం అంకెలు మాత్రమే కాదు, చితికిపోయిన కుటుంబాల వేదనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 

ఇటీవలే కేరళంలోని త్రిస్సూర్‌ జిల్లాలోని బాణసంచా తయారీ యూనిట్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు వీరి శరీరాలు ఛిద్రమైపోయాయి. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల మేర వినిపించాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో త్రిస్సూర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 26న నిర్వహించనున్న త్రిస్సూర్‌ పూరమ్‌ పండుగ కోసం స్థానికంగా ఉన్న పొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారీ చేపట్టారు. ఈ క్రమంలోనే.. పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు మొదలైనప్పుడు అక్కడ 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

చాలా మంది స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దాంతో.. భారీ ప్రాణ నష్టం తప్పింది. తమిళనాడులోనూ కొద్ది రోజుల ముందు ఇలాంటి పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్‌పట్టి ప్రాంతంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర శభ్దాలు వినిపించాయి. బాణసంచా తయారీ యూనిట్‌లోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాణసంచా యూనిట్లలో చిన్న పొరపాటు జరిగినా, అది పెను ప్రమాదానికి దారితీస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడం, కెమికల్స్ మిక్సింగ్‌లో అజాగ్రత్తలతో.. క్షణాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. 

ఇదే ఏడాది ఏపీలోని సామర్లకోట మండలంలో అత్యంత విషాదకరమైన బాణాసంచా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద బాణాసంచా పేలుళ్లలో ఒకటిగా నిలిచింది. ఈ పేలుడులో.. 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళా కార్మికులే ఉన్నారు. పది మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కెమికల్ డ్రమ్స్‌లో ఏర్పడిన నిప్పు రవ్వ కారణంగా ఈ భారీ పేలుడు సంభవించినట్లు గుర్తించారు. ఫ్యాక్టరీలో కేవలం 8 మంది కార్మికులకు మాత్రమే అనుమతి ఉండగా, ప్రమాద సమయంలో సుమారు 35 మంది వరకు పని చేస్తున్నట్లు తేలింది. 

అంతకుముందు.. కోనసీమలోని రాయవరం మండలంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస పేలుడు ఘటనలు చూశాక ఒక్క విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. బాణసంచా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు.. ఉదయం వెళ్తే, సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం లేదు. అడుగు తీసి అడుగు వేస్తే పేలుడు సంభవిస్తుందేమో అన్న భయం మధ్యే బతుకుతున్నారు. వ్యవస్థలో మార్పు రాకపోతే, అధికారుల బాధ్యతారాహిత్యం ఇలాగే కొనసాగితే.. మరిన్ని ప్రాణాలు బుగ్గి కావడం ఖాయం. మరి ఈ ప్రమాదాల నిరోధానికి శాశ్వత పరిష్కారం ఎప్పుడో?
 

By
en-us Political News

  
ప్రస్తుత ఏడాది 2026 తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఊహించని మందగమనాన్ని నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని కేసీఆర్ అన్నారు.
మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముంబైలో నడి రోడ్డుపై మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్‌మహాజన్‌పై ఒక విద్యావంతురాలైన తల్లి మండిపడ్డ తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలో భారతీయ పర్యాటకులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది.
కడప నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రగతి దీర్ఘకాలం పాటు కొనసాగించాలంటే దేశీయంగా ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన కొన్నేళ్లుగా భారత వాస్తవ జీడీపీ వృద్ధి సగటున 7.7 శాతంగా నమోదవుతోంది. ముఖ్యంగా పొరుగు దేశమైన చైనా 4.6 శాతం వృద్ధి వద్ద ఆగిపోగా, ఇతర వర్ధమాన దేశాలు 3.4 శాతానికే పరిమితమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.