గ్రేట్ ‘క్రేజీ’వాల్

Publish Date:Feb 2, 2022

Advertisement

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. చీపురు గుర్తుతో పార్టీ పెట్టి.. ఆ తర్వాత.. ఎన్నికల్లో గెలుచి.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాద్యతుల చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆయన చేపట్టిన పనులు అన్నీ సంచలనాలే. ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదిలి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సార్... తన విధి, విధానాలతో ఒక్క రూపాయి కూడా అప్పు లేని రాష్ట్రంగా ఢిల్లీకీ గుర్తింపు తీసుకు వచ్చారీ కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయానికి ఢిల్లీ.. అప్పుల కుప్పగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకు వచ్చి.. తన సమర్థతను చాటుకున్నారీ ఢిల్లీ ముఖ్యమంత్రి.    

ఢిల్లీలోని ప్రజలందరికీ అన్ని వ్యాధులకూ వైద్య సేవలందించడంతోపాటు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు ఉచితంగా అందిస్తుందీ కేజ్రీవాల్ సర్కార్. అంతేకాదు.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుందీ ప్రభుత్వం. సదరు పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలను దీటుగా పని చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో చాప చుట్టేసి అటకెక్కించిన ఆనంద వేదిక (Happiness Curriculum) ఢిల్లీలో మాత్రం అద్భుతంగా నడుస్తోంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి  మనీష్ సిసోడియాలు తరచూ ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ప్రధానోపాధ్యాయుడికి ఎదురుగా ఉన్న కుర్చిలో మాత్రమే వారు కూర్చుంటారు. అంతేకాదు.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయునితో పాటుగా ఎస్టేట్ మేనేజర్ పేరుతో మరో ప్రధానోపాధ్యాయుడిని కేజ్రీవాల్ ప్రభుత్వం నియమించింది. వీరు పాఠశాలకు అవసరమయ్యే వసతులు, నిర్వహణతోపాటు పాఠశాలల మరమ్మతులను వీరు పర్యవేక్షిస్తుంటారు. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం అకడమిక్ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాల్సి ఉంటుంది.

అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల  ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశంలోని కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు పప్పు బెల్లాలు పంచుతోందని ఆయన ఆరోపించారు. ఇది చెడ్డ రాజకీయాలకు  నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. అయితే చక్కని అవగాహనతో, సమర్థతతో, దార్శనికతతో ఢిల్లీ ప్రజలను పాలన అందిస్తున్న కేజ్రివాల్‌కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి.

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.