Publish Date:Apr 14, 2026
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై తనకు ఇసుమంతైనా నమ్మకం లేదని, ఆమె నేతృత్వంలోని బెంచ్ ముందు తనకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు సదరు న్యాయమూర్తి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని (రెక్యుసల్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.
గతంలో ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సుదీర్ఘంగా మూడు నెలల పాటు పరిశీలించి, అది తప్పుడు కేసు అని తేల్చిచెప్పిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించగానే కేవలం తొలి రోజే ఆ తీర్పును పక్కనపెట్టేలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ వ్యవహరించారని ఆరోపించారు. కేవలం మూడు విచారణలతోనే నిందితులందరినీ అవినీతిపరులుగా ముద్ర వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
న్యాయమూర్తి గతంలో ఏబీవీపీ వంటి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన విషయాన్ని కేజ్రీవాల్ తన వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలంతో సంబంధం ఉన్న వారికి తమ వంటి ప్రత్యర్థుల కేసుల్లో నిష్పాక్షికంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉండదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఉన్న కేసులను మాత్రమే అత్యంత వేగంగా విచారిస్తూ, దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించడం పక్షపాత వైఖరిని సూచిస్తోందన్నారు.
మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను సీబీఐ తరఫు న్యాయవాది తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ కారణాలను సాకుగా చూపి న్యాయమూర్తులను తప్పుకోవాలని కోరడం సరికాదన్నారు. ఇటువంటి ధోరణి న్యాయవ్యవస్థకు గొడ్డలిపెట్టన్నారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చని జడ్జిలపై ఇలాంటి ఆరోపణలు చేస్తే విచారణలు సాధ్యం కావని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పరిణామం ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. న్యాయమూర్తి స్వయంగా ఈ విచారణ నుంచి తప్పుకుంటారా లేక కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ విచారణాధికారి మారితే కేసు మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే కేజ్రీవాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-makes-sensational-remarks-against-judge-36-217301.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.