కేసీఆర్ అంతన్నారు ఇంతన్నారు..చివరికి తుస్సుమని పించారు!

Publish Date:Apr 29, 2022

Advertisement

కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ప్లీనరీ వేదికగా చేసిన ప్రసంగంలో తుస్సు మనిపించారు. ఫ్రంట్ లేదు, కూటమి లేదు.. ప్రాంతీయ పార్టీల ఐక్యత ఊసూ లేదు. మరి ఇంత కాలం ఆయన చెప్పిన మాటలు, తిరిగిన తిరుగుళ్లు, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీలు అంతా తుస్సేనా.. తెరాస క్యాడర్ ను కూడా ఇదే అనుమానం తొలుస్తున్నది.
 బీజేపీ మంత్రుల అవనీతి చిట్టా ఉందన్న ఆయన ప్లీనరీ వేదికపై ఆ మాటే ఎత్తలేదు. తిమ్మిని బమ్మిని చేసిన చందంగా జాతీయ స్థాయి అజెండా అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అది కూడా కేవలం బీజేపీపై విమర్శలు, ఆరోపణలు, తన పాలనపై పొగడ్తల పొగడ దండలు వినా ప్లీనరీలో ఆయన చేసిన ప్రసంగంలో పసా లేదు, విషయమూ లేదు. 

జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ సహా కేంద్రంలో తాను చక్రం తిప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇచ్చిన బిల్డప్ అంతా కేసీఆర్ ప్లీనరీ ప్రసంగంతో తుస్సు మనిపోయింది. కారణం ఏమిటి? అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూడా రాజకీయ పరిస్థితులు అనువుగా లేవన్న గ్రహింపుతోనే కేసీఆర్  గత గంభీర ప్రకటనల ఊసెత్తకుండా, కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి, తన మాటల గారడీతో ప్రజలలో తన గత ప్రకటనల ప్రభావాన్ని తుడిపేయడానికి ప్రయత్నించారు. 

ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ప్రసంగంలో బీజేపీవై విర్శలు, ఆరోపణలు కూడా ఏదో చేయకపోతే బాగుండదు, ఇంత కాలం ఆ పార్టీపై ఒంటికాలిపై లేచి ఇప్పుడు అసలు ఊసే ఎత్తకపోతే జనం సందేహిస్తారు అన్నట్లుగానే ఉన్నాయి.  

ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగంలో మెరుపులు లేదు, సంచలన ప్రకటనలు లేవు, నిర్ణయాలు లేవు..కేవలం ఫ్రంటు, కూటమి, పార్టీ వంటివేమీ లేవన్న వివరణ ఇచ్చుకోవడానికే అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది. అలాగే జనం దృష్టిని రాజకీయ అంశాలపై నుంచి తెరాస వైపు తిప్పుకునేందుకే ఇప్పటికిప్పుడు హడావుడిగా ప్లీనరీ పెట్టారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవచ్చు. ఉద్యమ సమయంలో పార్టీ త్యాగాలను, పోరాట సంకల్పాన్ని మరోసారి వల్లె వేసి ప్రజల్లో ఉద్వేగాలను పదిలంగా కాపాడుకోవచ్చు. అంతే కానీ ప్లీనరీ నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే కేసీఆర్ ప్లీనరీ ఏర్పాటు చేశారు. 

జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్  స్వయంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్, డిల్లీ లకు ఇటీవల వెళ్ళారు. ఒక్క డిల్లీ సిఎం మినహా... మిగతా వారిని కలిశారు. దేశ రాజకీయ పరిస్థితులు, సమాఖ్య స్పూర్తి, రాష్ట్రాల హక్కులు, ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవరసరం వంటి విషయాలపై చర్చించారు. తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.  బిజెపిని బంగాళాఖాతంలో కలిపేయ్యాలని సిఎం కెసిఆర్ నినదించారు. బిజెపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీయేతర కూటమిని ఏర్పాటుకు సంకేతాలిచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 2019లోనూ వెస్టుబెంగాల్ కు వెళ్ళిన సిఎం కెసిఆర్ తర్వాత ఇతర నాయకులను కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రకటనలు కూడా చేశారు. అనంతరం ఈ విషయాలు ప్రక్కకు పెట్టారు. రెండేండ్లు గడిచాయి. ఇటీవల కూడా పలు రకాలుగా జాతీయ రాజకీయాలపై  ప్రకటనలు చేశారు. కానీ, అవేవీ కార్యరూపంలోకి రాలేదు. దీంతో టిఆర్ఎస్ ప్లీనరీలో ఫ్రంట్ లేదు. కూటమి లేదు. గుంపు కూడా లేదు. దేశానికి ప్రత్యేకంగా ఓ ఎజెండా కావాలి. ప్రత్యేక రైతు, పారిశ్రామిక విధానం రావాలి. అంటూ తేల్చాశారు. దేశ్ కీ నేతా స్థాయిలో ప్రచారం చేసుకున్న కేసీఆర్ హఠాత్తుగా ఆస్త్ర సన్యాసం చేయడమేమిటి? అన్న చర్చ ప్లీనరీ ప్రసంగం తరువాత తెరాస శ్రేణుల్లో మొదలైంది.

 దేశ్ కీ నేత కెసిఆర్ అనే ప్లెక్సీలు ఇతర రాష్ట్రాల్లోనూ వెలిశాయి. కానీ, దేశంలో కూటమి లేదు. ఫ్రంటులేదు. గుంపు లేదు. అని సిఎం కెసిఆర్ తేల్చిచెప్పడం వెనుక అసలు కారణమేంటి..? అనే  సందేహం ఇప్పుడు  పార్టీ శ్రేణుల్లోనే కాదు, రాష్ట్ర ప్రజానీకంలో కూడా వ్యక్తమౌతోంది.  దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మాట నుంచి దేశానికి కొత్త ఎజెండా కావాలి అనే జనరలైజ్ స్టేట్ మెంట్    అధినేత కెసిఆర్ నోట వెంట రావడం రాజకీయ విశ్లేషకులను సేతం విస్మయ పరిచింది. కోటలు దాటిన తన మాటలు గడప కూడా దాటకపోవడంపై ప్రజలు నొసలు చిట్లించకుండా ఉండేందుకు, వారి  దృష్టిని తెరాస వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నంగా ఆయన ప్లీనరీ ప్రసంగాన్ని చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.