కేసీఆర్ ఆయుధాలు అయిపోయాయా?.. బీఆర్ఎస్ జోరు చూపేనా?

Publish Date:Jan 15, 2023

Advertisement

తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో షికారు చేసిన  పార్టీని ఇకపై దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే... ఆ పార్టీ  తెలంగాణ  కనబరిచిన జోరు దేశవ్యాప్తంగా ఉంటుందా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

తాజాగా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారడం వల్ల.. తెలంగాణ అనే పదం స్థానంలో భారత్ అనే పదం వచ్చి చేరడం వల్ల.. ఇది తెలంగాణ ప్రజలను ఇకపై అంతగా ప్రభావితం చేయలేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలు జరిగినా... ఆంధ్ర అనే పదాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకొంటూ.. కారు పార్టీ నాయకత్వం తెలంగాణ గడ్డపై షికారు చేసింది. అందుకు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్న తేడా లేకుండా ఏకపక్షంగా ఆ పార్టీ గెలిచిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకొందని... దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే... మళ్లీ చంద్రబాబు తెలంగాణ గడ్డపై నుంచి రాజ్యమేలతాడంటూ.. తెలంగాణ ప్రజల్లో ప్రచారం చేసి విజయం సాధించడంలో కేసీఆర్   100కి వంద శాతం సఫలీకృతమయ్యారనీ అలా తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్ ఇప్పటి వరకూ ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారనీ, ఇక పార్టీలో తెలంగాణ ఆత్మను తీసేసిన తరువాత ఆ సెంటిమెంట్ ను మళ్లీ వర్కౌట్ చేయడం కష్టమనీ అంటున్నారు.     

గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫ్యామిలీ ఇదే రీతిగా వ్యవహరించిందనడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగణ గెడ్డపై తెలుగుదేశం పార్టీలో కేడర్ ఎంత బలంగా ఉన్నా.. సైకిల్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడంలో వెనకబడిపోయిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  పాండవులు... జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను దించినట్లు.. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్  లీ ఓ ఆయుధంగా అవసరమైనప్పుడు వాడుకొంటూ.. ఎన్నికల రణక్షేత్రానికి వెళ్లేవారని అంటున్నారు.  కానీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత.. తెలంగాణ అనే సెంటిమెంట్.. ఎక్సపైయర్ అయిన అయిమెంట్‌లాగా అయిపోయిందని.. దీంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ  స్థిరమైన నాయకత్వాన్ని కోల్పోబోతున్నదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

దీంతో తెలంగాణ గడ్డ మీదే.. కేసీఆర్‌కు ఓట్లు పడడం కష్టమని చెబుతున్నారు. మరోవైపు గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ పార్టీ ఉన్నంత బలంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవీ లేవని.. కానీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బలం పుంజుకొంటున్నాయని వారు చెబుతున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని  కేసీఆర్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతే పోటీగా.. బీజేపీ జెండాని తెలంగణ గడ్డపై రెపరెపలాడించలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని.. అలాగే రేవంత్ రెడ్డి సారథ్యలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తోందని.. ఇక టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలుపుకొంటారా? అంటే అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయపడుతున్నారు. ఇంకో వైపు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తుండంతో.. తెలంగాణలో గద్దెనెక్కేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడిన తెలంగాణ సెంటిమెంట్  ఏమంత ఉపయోగపడదనీ చెబుతున్నారు.  

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.