కేసీఆర్ జర్నీ టు కాంగ్రెస్ వయా కేవీపీ

Publish Date:Jul 26, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలంటూ చేసిన విన్యాసం కేంద్రంతో సంబంధాలను తెగేదాకా లాగేసిందా? ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు సొంత రాష్ట్రంలో నిలవడమెలా అన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారా? ఆయన తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో తనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ ను ఆశ్రయించడానికేనా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు.. ఢిల్లీ చేరిన తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా తనను ఇప్పుడు ఆదుకుని ఒడ్డున పడేయగల పార్టీ కాంగ్రెస్సేనని కేసీఆర్ నమ్ముతున్నారని తెరాసలో ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు అంటున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ కు పార్టీని చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసే పనిలోనే ఆయన తాజా హస్తిన పర్యటన అనీ అంటున్నారు. తనంత తానుగా కాంగ్రెస్ కు చేరవ అవ్వడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి విదితమే.

తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న ప్రతిపాదనను కూడా ఆయన ఒక మధ్య వర్తి ద్వారా సోనియాకు చేసినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి అందుకు ససేమిరా అన్నారని అంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చురుకుగా వ్యవహరించారనీ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, యశ్వంత్ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించి రాచమర్యాదలు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి హఠాత్తుగా హస్తిన పర్యటన చేపట్టడంతోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేశారు.

ఇటీవలి కాలంలో ఆయన ఒక్కసారంటే ఒక్క సారి కూడా ప్రధానితో భేటీ కాకపోవడం.. ఆయన పలు సందర్భాలలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రొటోకాల్ ను కూడా పాటించకుండా ఆయనకు ఆహ్వానం, వీడ్కోలు పలకకుండా దూరంగా ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ తెరాసను దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తన విమర్శలకు టార్గెట్ గా ప్రధాని మోడీని ఎంచుకోవడంతో బీజేపీతోనూ, మోడీతోనూ పూడ్చడానికి వీల్లేనంతగా అగాధం పెరిగిందని తెరాస వర్గాలే చెబుతున్నాయి. రాజకీయంగా వైరి పక్షాలైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతగా ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణపై దృష్టి సారించిందనీ, పరిమితులకు మించిన అప్పులు, కాళేశ్వరం జాతీయ హోదా అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, అవకతవకలను ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వెల్లడించిందని అంటున్నారు.

కాగా ఇంత కాలం కేంద్రం విమర్శలను,  అప్పులు కేటాయింపుల విషయంలో కేంద్రాన్ని దీటుగా ఎదుర్కొన్న కేసీఆర్ ఇటీవలి వరదలలో కాళేశ్వరం పంప్ హౌస్ లు  నీట మునిగి, ప్రాజెక్టు లోపాలు బహిర్గతం కావడంతో డిఫెన్స లో పడ్డారని అంటున్నారు. దీంతో కేంద్రానికి చేరువ కావడానికి, రాజీపడటానికి అవకాశాలన్నీ మూసుకు పోయిన తరుణంలో ఆయనకు కనిపిస్తున్న ఏకైక హోప్ కాంగ్రెస్సేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కు చేరువ కావడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన రెండు చేతులతో అందుకోవడానికి చేయని ప్రయత్నం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ భవన్ వద్ద విపక్షాలతో ధర్నాకు కాంగ్రెస్  పిలుపునిచ్చిన సందర్భంలో అన్ని పార్టీల కంటే ముందుగా గాంధీ భవన్ కు ప్లకార్డులతో చేరుకున్నది తెరాస ఎంపీలే. అలాగే సోనియా గాంధీ ఈడీ విచారణ కోసం వెళ్లినప్పుడు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది కూడా టీఆర్ఎస్ ఎంపీలే. ఆందోళనా కార్యక్రమాలపై చర్చించేందుకు పార్లమెంటు ఆవరణలోని కాంగ్రెస్ కార్యాలయంలో విపక్షాల సమావేశానికి కూడా తెరాస హాజరైంది.

సోనియాను ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ కు సంఘీ భావం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హస్తిన పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో తెరాస ఎంపీలు కాంగ్రెస్ తో కలిసి వివిధ అంశాలపై పోరాడాలని ఇప్పటికే కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే హస్తిన పర్యటనకు ముందు ఆయన కేవీపీతో పలు మార్లు సంభాషించారనీ, ఒక అడుగు తాను వెనక్కు వేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నాననీ ఆయన కేవీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. కేవీపీ ద్వారా ఆయన తన హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హస్తిన చేరిన తరువాత కూడా ఈ విషయంపై ఆయన కేవీపీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ కాంగ్రెస్ తో సయోధ్యకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారని చెబుతున్నారు. ఇటు తెలంగాణలో తెరాస మరోసారి అధికారంలోకి రావాలన్నా.. అటు జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ స్నేహం అనివార్యమని కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేసీఆర్ హస్తిన పర్యటనలో హస్తం పార్టీకి తెరాసను చేరువ చేసే కేసీఆర్ యత్రాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయనకు కేవీపీ భరోసా ఇచ్చారనీ చెబుతున్నారు. 

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.