బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు తథ్యం.. ఎప్పుడంటే?

Publish Date:Aug 29, 2023

Advertisement

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక విలక్షణ రాజకీయ నేత. ఆయన ఏ పథకం ప్రకటించినా,  ఏ కార్యక్రమం చేపట్టినా  సంచలనంగానే ఉంటుంది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వారిని దిగ్భ్రమలో ముంచెత్తేలా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. తెలంగాణ సాకారం అయితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించడం దగ్గర నుంచీ, తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ను (అప్పుడు టీఆర్ఎస్) కాంగ్రెస్ లో విలీనం చేస్తాననడం వరకూ ఆయన మాటే ఒక సంచలనం, ప్రకటన మరో సంచలనం అన్నట్లుగానే సాగింది.

ప్రకటనలు చేయడం తరువాత వాటి గురించి పూర్తిగా విస్మరించడం ఒక విధానంగా కేసీఆర్ డెవలప్ చేశారు. తాజాగా ఆయన ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేశారు. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీలో తన మాటే శాసనం అన్న పరిస్థితి ఉందని అందరికీ చాటేందుకు ఆయనీ ఎత్తుగడ వేశారు. అయితే ఆయన ఎత్తుగడ ఫలించినట్లు కనిపించదు.  ఎందుకంటే ఆయన ఇలా జాబితా ప్రకటించారో లేదో.. అలా అసమ్మతి భగ్గుమంది.

కేసీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రులుగా గుర్పింపు పొందిన నేతలే అసమ్మతి గళం ఎత్తారు. టికెట్ లభించని పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్న తరువాత కూడా ఆయన అసమ్మతి రాగం ఆలపిస్తూనే ఉన్నారు. రాజయ్య వంటి వారు తమ ధిక్కారాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మైనంపాటి వంటి నేతలైతే బహిరంగ సమావేశాలు నిర్వహించి మరీ తిరుగుబావుటా ఎగుర వేశారు. అనూహ్యంగా పార్టీ పునాదులే కదిలిపోయేంతగా అసమ్మతి వెల్లువెత్తడంతో కేసీఆర్ వెనక్కు తగ్గక తప్పలేదు. టికెట్ ప్రకటించిన వారందరికీ పార్టీ బీఫారం దక్కుతుందన్న గ్యారంటీ లేదని ఆయన తన ప్రకటనలో సవరణలు ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో టికెట్  దక్కని వారు ఇప్పటికే ధిక్కారం తెలియజేస్తుంటే.. రేపు టికెట్ వచ్చిందని ప్రస్తుతం ఆనందంలో ఉన్న నేతలలో కొందరికి రేపు బీఫారంలు అందక నిరసన గళం వినిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

115 మందితో బీఆర్‌ఎస్‌ తొలిజాబితా ప్రకటించిన  కేసీఆర్‌ వారందరికీ , బీ ఫారం ఇస్తారా? అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు జాబితాలో ఉన్న వారందరికీ  బీఫారాలు దక్కుతాయన్న నమ్మకం లేదని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. కచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు.  తొలి జాబితాలో పేరు ఉన్న మైనంపల్లి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మైనంపాటి హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాను, తన కుమారుడు ఇద్దరం కచ్చితంగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మైనంపల్లి పార్టీ మారడం ఖాయమైతే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరొకరిని కేసీఆర్ నిలబెట్టాల్సి ఉంటుంది.  ఇక ఖమ్మంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబావుటా ఎగురవేశారు. తుమ్మల పార్టీ వీడితే ఆ ప్రభావం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్ ను వీడటం వల్ల జరిగిన నష్టం చాలదన్నట్లు తుమ్మల కూడా పార్టీ మారితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితి ఎదురౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్టర్ ప్రహ్లాద్, నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశంలు కూడా బీఆర్ఎస్ ను వీడే యోచన చేస్తున్నారు.  నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ వర్గాలు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్  అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   అక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ   కడారి అంజయ్యయాదవ్‌ కూడా పార్టీ వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.   హైదరాబాద్‌  అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు సీటి వ్వడంపై, సీనియర్‌ దుర్గాప్రసాద్‌రెడ్డి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్ని ల్లోనే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయన డీపీరెడ్డి..ఈసారి టికెట్‌ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే మళ్లీ కాలేరు పేరు ప్రకటించడంతో అక్కడ కూడా అసమ్మతి తీవ్రంగా వ్యక్తం అవుతోంది.  పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కనీసంలో కనీసం పాతిక స్థానాలలో బీఆర్ఎస్ విజయంపై అసమ్మతి ప్రభావం తీవ్రంగా ఉంటుందనీ, 40 స్థానాలకు పైగా అసమ్మతి ప్రభావం గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 ఈ నేపథ్యంలోనే తాను ప్రకటించిన జాబితా విషయంలో స్వయంగా కేసీఆర్ పునరాలోచనలో పడ్డారనీ, రానున్న రోజులలో ఈ జాబితాలో కచ్చితంగా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంత లేదన్న పాతిక నుంచి ముఫ్పై నియోజకవర్గాలలో ఆభ్యర్థులను మార్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు చెబుతున్నారు.    తాజాగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే  జరుగుతోందని చెబుతున్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారనీ, తాను ప్రకటించిన జాబితా కేవలం ప్రతిపాదిత జాబితా మాత్రమేనంటూ అసంతృప్తిలో ఉన్న నేతలకు వర్తమానం పంపుతున్నారనీ,   ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అసలు జాబితా విడుదల చేస్తామనీ చెబుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది.  అన్నిటికీ మించి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్  అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొన్ని అభ్యర్థిత్వాలపై పునరాలోచన జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.   

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.