ఇక గులాబి బాస్ ఎన్నికల ప్రచార భేరి.. వరుస సభలతో సుడిగాలి పర్యటనలు

Publish Date:Oct 11, 2023

Advertisement

తెలంగాణలో ఎన్నికల సమరం జోరందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచే రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల రణరంగంలోకి దూకేశాయి. అందరి కంటే ముందుగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లుగా కనిపించిన అధికార బీఆర్ఎస్ మాత్రం ఆ తరువాత వెనుకబడినట్లుగా కనిపించింది. ఇందుకు కారణాలెన్నున్నా.. వాటిలో ముఖ్యమైనది మాత్రం కేసీఆర్ అనారోగ్యమనే చెప్పాలి.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను ఒకే దఫాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. దూకుడు మీద కనిపించిన కేసీఆర్.. పార్టీలో వెల్లువెత్తిన అసమ్మతి, అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. టికెట్లు ఆశించి దక్కక అసంతృప్తికి లోనైన వారిని పదవుల పందేరంతో బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించారు. కొందరికి పదవులు కట్టబెట్టారు కూడా. అయితే ఆ తరువాత ఆయన అస్వస్థతకు గురి కావడంతో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహకాల విషయంలో, పార్టీలో లుకలుకలను పరిష్కరించుకునే విషయంలో బాగా వెనుక బడింది. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కిరాకపోయినా.. ప్రచారం, ప్రచార సన్నాహకాల విషయంలో మాత్రం కాంగ్రెస్ రేసు గుర్రంలా దూసుకుపోతున్నది. ఆ పార్టీ సంస్కృతిలో భాగంగా అందరూ చెప్పే అసమ్మతి, గ్రూపు విభేదాలను ఈ  పార్టీ చాకచక్యంతో పరిష్కరించుకుంది.

ఇక  బీజేపీ  కూడా అగ్రనేతల వరుస పర్యటనలతో దూకుడు  ప్రదర్శిస్తున్నది. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ మాత్రం అధినత అనారోగ్యం కారణంగా డీలా పడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు మూడు వారాల పాటు ఇంటికే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల  చంద్రశేఖరరావు తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కదన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 15నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా  పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేసేశారు. ఈ నెల 15న ప్రగతి భవన్ లో అభ్యర్థులకు బీ ఫాంల పంపిణీతో మొదలెట్టి పార్టీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు.  ఆయన సెంటిమెంట్ ప్రకారం వచ్చే నెల 9న తన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ సారి ఆయన గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అదే  రోజుల అంటే నవంబర్ 9న  ఆయన రెండు నియోజకవర్గాలలోనూ నామినేషన్లు దాఖలు  చేస్తారు.

ఇక ఎన్నికల ప్రచారాన్ని  కూడా ఆయన తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచే ప్రారంభించనున్నారు.  ఈ నెల 15 హుస్నాబాద్ తో మొదలు పెట్టి వరుసగా నాలుగు రోజుల పాటు ఏడు నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేసి  బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఆ తరువాత వారం రోజులు అంటే ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకూ విశ్రాంతి తీసుకుంటారు.  ఆ తర్వాత అంటే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు వరుసగా నియోజకవర్గాలలో నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో  ప్రసంగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ పర్యటనలు, సభలకు సంబంధించి రోడ్ మ్యాప్, షెడ్యూల్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.