అస‌లే టెన్ష‌న్ టెన్ష‌న్‌.. మ‌రో వంక కేటీఆర్ 

Publish Date:Aug 27, 2022

Advertisement

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయ‌డం ఆయ‌న‌పై పీడీ యాక్టు విధించ‌డంతో ప‌రిస్థితులు అదుపుత‌ప్పాయి. భ‌జ‌రంగ ద‌ళ్ వీహెచ్‌పీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. దీంతో చాంద్రాయ‌ణ‌గుట్ట ప్రాంతం హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి పూను కున్నారు. 

ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్ ప్రక టించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహ రించారు.

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి మంగళహాట్ పోలీసులు కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియో ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన  ఓ వర్గాన్ని  తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో  పలు కేసులు నమోదయ్యాయి.  సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయిం చారు.  

By
en-us Political News

  
నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది.
నాలుగో విడత పోలింగ్ సమాప్తం
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.
పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో  బీభత్సం సృష్టించారు
5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్
 ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అయితే ఎవరు ఎంత చెప్పినా.. కొందరు మాత్రం అస్సలు మారరు. గడప దాటరు. ఓటు వేయరు. ఏం జరిగినా మనకెందుకులే అని కూర్చొంటారు. అలాంటి వారిలో హైదరాబాదీలు కూడా ఉన్నారు.
కుప్పం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిని బద్దలు కొడతామంటూ ఇంత కాలం వైసీపీ ప్రగల్భాలు పలికింది.
జిల్లాల వారీగా ఏపీ పోలింగ్ శాతం 3 గంటలకు....
వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా.. నగరి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ సోమవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఆమె కాడె వదిలేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి నేరుగా కాకపోయినా ఆమె తన ఓటమిని మీడియా ముందు అంగీకరించేశారు.
కుప్పంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ అనవసరపు ఆత్రం ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు.
సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.