Publish Date:Apr 24, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్ పునర్వ్యవస్థీరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి సరికొత్త టీమ్ తో సిద్ధం అవ్వాలని భావిస్తున్నారా? ఏరి కోరి తాను తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా అదే చెప్పారా? ఇప్పుడు తెరాస వర్గాలలో విస్తృతంగా నడుస్తున్న చర్చ అదే. రెండు దఫాలుగా అంటు 2014, 2018 ఎన్నికలలో విజయం తరువాత ఆయన కేబినెట్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు మూడో సారి ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీమ్ ను మార్చుకోవాలని, వీలైతే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి అవసరం ఉందనీ ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించనట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే టీమ్ జరిపిన రహస్య సర్వేలలో పలువురు మంత్రులపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్లు తేలందని చెబుతున్నారు.
సర్వేల వ్యవహారం పక్కన పెడితే ఇటీవలి కాలంలో పలువురు మంత్రులు వివాదాలలో ఇరుక్కుని ప్రతిష్టను మసకబార్చుకోవడం, ఆ ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందన్న భావనలో ఉన్న కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇదే తరుణమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై తనకు సన్నిహితులతో ఒక దఫా చర్చించినట్లు కూడా చెబుతున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలికి....వారి స్థానంలో ఉత్సాహంగా పని చేసే యువకులను నియమంచాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు సృష్టించిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ లో మార్పులు, చేర్పులూ అనగానే సహజంగానే
అందరిలో ఉత్కంఠ, ఆసక్తి నెలకన్నాయి. ఎన్నికల ముంగిట కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ కసరత్తుకు కారణం ఈ కేబినెట్ టీమ్ తో ఎన్నకలకు వెళితే నష్టం ఉంటుందన్న భావనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. వివాదాలలో ఇరుక్కున్న వారూ ఉన్నారు. వారి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలలో తేలంది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వివాదాల మంత్రుల కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నదనీ, అటువంటి వారిని ఇంకా మంత్రులుగా కొనసాగిస్తే అది ఎన్నికలలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-to-go-for-vabinet-reshuffle-25-134881.html
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.