కాంగ్రెస్ కు కేసీఆర్ సరెండర్?

Publish Date:Jun 27, 2022

Advertisement

రాష్ట్రపతి ఎన్నికలు తెరాస నిజ రూపాన్ని బయట పెట్టాయా? ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యారా? అంటే అవుననే అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు.  ఇంతవరకు కేసీఆర్, కేటీఆర్, అదే విధంగా ఇతర మంత్రులు, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా  గాంధీ, రాహుల్ గాంధీని దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా , జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిఅంగీకరించేది లేదని, స్వయంగా కేసీఆర్, కేటీఅర్ అనేక సందర్భాలలో సప్ష్టమైన ప్రకటనలు చేసారు.  కాంగ్రెస్ పార్టీని పనికిమాలిన పార్టీ, దిక్కుమాలిన నాయకత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేతకాని తనం వల్లనే, దేశంలో  బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగిందని తండ్రీ కొడుకులు  తిట్టని రోజు లేదు. అయితే,  కాంగ్రెస్ పార్టీ పేరెత్తితేనే అంతల కస్సుమనే కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఉమ్మడి అభ్యర్ధి, యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు.

కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా, మంత్రి కేటీఅర్ తో పాటుగా అరడజను మంది వరకూ పార్టీ ఎంపీలు, సిన్హా నామినేషన్ పత్రాలపై సంతాకాలు చేసారు. నామినేషన్ కార్యక్రమలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో చెట్టపట్టాలేసుకుని కనిపించారు.ఇవన్నీ , చూస్తుంటే, అదే అన్జిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆలోచనకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్ కు సరెండర్ అయిపోయారని, అంటున్నారు.  

నిజానికి కేసీఆర్, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, జాతీయ  రాజకీయాలపైనే దృష్టిని  కేంద్రీకరించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఫెడరల్ ఫ్రంట్ వేర్పాటు చేసేందుకు, చాలా చాలా ప్రయత్నాలు చేశారు. దేశమంతా తిరిగి, అనేక  రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి చర్చలు జరిపారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోవడంతో కావచ్చును, కొత్తగా జాతీయ పార్టీ తెర మీదకు తెచ్చారు. ఆ దిశగా, కొంత కసరత్తు కూడా చేశారు. ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెపుతున్నారు.

అయితే అది కూడా ముడిపడే అవకాశం లేదని తేలడంతో ... పక్షం రోజుల క్రితం కాంగ్రెస్ ఉన్న కూటమితో చేతులు కలిపేది లేదని ప్రకటించిన కేసీఆర్, అదే కూటమితో చేతులు కలిపారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమలో కేటీఆర్ పాల్గొన్నారు.  దీంతో తెరాస, కాంగ్రెస్ సంబంధాలపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటాల యుద్ధం జరుగుతుంటే.. ఇంకోవైపు ఆ రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసిపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి, చాలా కాలంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెరాస, బీజేపీ అవిభక్త  కవలలని ఆరోపిస్తున్నారు .

గతంలో  కేంద్ర ప్రభుత్వం  తీసుకున్న కీలక నిర్ణయాలను తెరాస సమర్ధించిన విషయాన్నీ గుర్తు చేస్తూ, తెరాస, బీజేపీ షాడో ఫైటింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మరో వంక బీజేపీ నాయకులు  కాంగ్రెస్, తెరాస జోడీ పై అవే ఆరోపణలు చేస్తున్నారు. బయటకు  తిట్టుకున్నా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఒకటేనని బీజేపీ నేతలు అరిపిస్తున్నారు. అదే విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. పైగా.. కాంగ్రెస్‌ నేతలకు ఓట్లేస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉండరని, ఇందుకు సంబంధించి కళ్ళముందున్న అనుభవాల ఆధారంగా  ఆలోచించుకోవాలని ప్రజలను కోరుతున్నారు. గత ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలలో మూడొంతుల మంది తెరాసలో చేరారని గుర్తు చేస్తున్నారు. 

నిజానికి, రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ఎన్నికల రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనే, అయినా, ఇంతవరకు కేసేఆర్ ఎప్పడూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజకీయ ప్రత్యర్ధిగా భావించలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినా, హస్తం పార్టీ ఎమ్మెల్యేలు  పిలవకుండానే తెరాసలో చేరతారనే విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీని ఒక ఫ్రెండ్లీ పార్టీగానే చూస్తు వచ్చారు. కానీ, ఇప్పడు, థర్డ్ ఫోర్సుగా బీజేపీ తెర మీదకు రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెట్టడంతో, కేసీఆర్వ్యూ హం మార్చుకుంటున్నారని అంటున్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తో ప్రత్యక్ష  పొత్తుకు కూడా వెనకాడక పోవచ్చని   అంటున్నారు.

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.