గులాబీ బాస్ కోటకు బీటలు!?

Publish Date:Sep 2, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?  రాష్ట్రంలో రాజకీయాలను తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి తాను జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే లక్ష్యంతో లోక్ సభకు పోటీ చేస్తారా? అన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకూ కొందరిలోనై ఉండేవి. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఒక స్థానం నుంచి కాదు ఏకంగా రెండు స్థానాల నుంచి పోటీకి నిలబడతానంటూ ప్రకటించడంతో  ఆయన జాతీయ రాజకీయాల ప్రకటనలన్నీ రాజకీయ పబ్బం కోసం చేసినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అయితే ఆయన తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది ప్రకటించడానికి ముందే.. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ తాను ప్రత్యర్థిగా పోటీలోకి దిగుతామంటూ ప్రకటనలు చేస్తున్న వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు.  అంతే కాకుండా ఆ మేరకు బీజేపీ అధిష్ఠానం అనుమతి కూడా కోరానని చెప్పారు.  పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించిన విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే  మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని   ప్రకటించేశారు.

ఇప్పుడు కేసీఆర్ తాను స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తన బలహీనతను తానే చాటుకున్నారు. గజ్వేల్ లో తనకు ఎదురుగాలి వీస్తున్నదని ఆయన పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. రెండో నియోజవకర్గంగా ఆయన కామారెడ్డిని ఎంచుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ తాను కేసీఆర్ పై పోటీకి సిద్ధమని సవాల్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ ను బహిష్కృతుడైన తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు తాజాగా ఓ సవాల్ విసిరారు. గజ్వేల్, కామారెడ్డి కాదు.. ఖమ్మంలోని మూడు జనరల్ స్థానాలలో ఒక స్థానం నించి కేసీఆర్ పోటీ చేయాలనీ, ఆయన ఏ స్థానాన్నిఎంచుకున్నా సరే ఆయనకు ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, ఒక వేళ తాను పరాజయం పాలైతే రాజకీయ సన్యాసం చేస్తాననీ సవాల్ విసిరారు.  

తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రత్యేక రాష్ట్రం సాధించిన నేతగా ఇప్పటి వరకూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఈ సారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనడానికి ఆయనపై పోటీ చేసి గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంకెంత మాత్రం తిరుగులేని శక్తిగా లేదనీ, అలాగే కేసీఆర్ కూడా గతంలోలా బలమైన నాయకుడిగా లేరనీ అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో గులాబీ కోటకే కాదు.. కేసీఆర్ నాయకత్వ సౌధం కూడా బీటలు వారిందని చెబుతున్నారు.   

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.