టార్గెట్ మోడీ.. వేదిక అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ.. కేసీఆర్ వ్యూహం!

Publish Date:Apr 10, 2023

Advertisement

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ పాలన, అవినీతిపై పరోక్షంగా చేసిన విమర్శలపై కేసీఆర్ స్పందించకపోవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేరుగా పేరు పెట్టి విమర్శించకుండా మోడీ పరోక్ష వ్యాఖ్యలకే సరిపెట్టేయడంతో కేసీఆర్ స్పందించలేదని కొందరు అంటుంటే.. మోడీపై పకడ్బందీ విమర్శలతో విరుచుకుపడేందుకు కేసీఆర్ సమాయత్తమౌతున్నారని మరి కొందరు అంటున్నారు.  మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఘాటు రిప్లై ఇచ్చేందుకు తగిన  అంబేడ్కర్ జయంతి రోజున  రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ సభేనని కేసీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కేసీఆర్ మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోడీ ప్రస్తావించిన అన్ని అంశాలకూ ఘాటుగా రిప్లై ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.  అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నెల 14న ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో కేసీఆర్ ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్న ఆసక్తి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై  సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  ఓ వైపు అంబేడ్కర్ ను కీర్తిస్తూనే.. మరోవైపు రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావిస్తూ మోడీకి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు.  కేంద్ర విధానాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయనడానికి ఉన్న ఉదాహరణలతో సహా మోడీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభ వేదికగా కేంద్రం, మోడీపై విమర్శలతో విరుచుకుపడే అవకాశాలు దండిగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.  ఉదాహరణలతో సహా వివరించడానికి కసరత్తు మొదలైంది. అంబేడ్కర్ ను నిరంతరం తల్చుకునే విధంగా రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టిన సంగతిని చెబుతూ,  కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంటు (సెంట్రల్ విస్టా) భవనానికి కూడా  అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ అసెంబ్లీ చేసి ఏకగ్రీవ తీర్మానాన్ని మోడీ లెక్కలోకి తీసుకోలేదన్న సంగతిని బలంగా ఎస్టాబ్లిష్ చేయలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  అదే విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతందని సోదాహరణంగా వివరించేందుకు కూడా సీఎం కేసీఆర్ సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.