డామిట్ ..కథ అడ్డం తిరిగింది

Publish Date:Jul 4, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యామ్నియ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి  అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్  గడప దాట లేదు.

మరోవంక  వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది.  ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని  బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై  ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇస్తారని ఆశించారు. ఆయనకు ఆయనే, ముందుగానే మోడీ, తనను టార్గెట్  చేస్తారని ప్రకటించుకున్నారు. అయితే, కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా, ఏర్పాటు చసిన విజయ సంకల్ప సభలో,ప్రధాని మోడీ 30 నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అసలు కేసేఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమి చేస్తుందో, నేరుగా ప్రజలకే చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. దీంతో కేసేఆర్ కు మోడీనుంచి తిట్లదండకం  ఆశించిన తెరాస నేతలకు మరో మారు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యమత్రి కేసీఆర్  ప్రశ్నలకు సమధానం చెప్పక పోగా అసలు, ఆయన ప్రస్తావనే చేయక పోవడం, ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ను  పూచిక పుల్లకంటే హీనంగా పక్కన పెట్టడం, అవమానంగా భావిస్తున్నారు.

సరే, అంత మాత్రం చేత, తెరాస ఇక  చేతులు ముడుచుకుని కుర్చుంటుందని  కాదు.  కానీ, కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేయక తప్పదని, ఎదంటే అది అనేస్తే కుదరదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా  తెరాస ఎన్నికల వ్యూహాన్ని సవరించుకోవలసి ఉంటుదని అంటున్నారు. 
అదలా ఉంటే విజయసంకల్ప సభ  ఎవరూ ఉహించని విధంగా సక్సెస్ అయింది. నిజానికి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు, పార్టీ జాతీయ నాయకత్వం తటపటాయించింది, సక్సెస్ కాకపోతే, అభాసు పాలవుతామని, ఒకటికి పదిసార్లు అలోచించి, సమాలోచనలు జరిపి చివరకు ఓకే చెప్పింది. అయినా, వ్యూహాత్మకంగా, ఉభయతారకంగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు, కేంద్ర మంత్రులు, వివిదః రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర కీలక నేతలను ఇంచార్జిలుగా నియమించి, మూడు నాలుగు రోజుల ముందునుంచి జనసంపర్క యాత్రలు నిర్వహించింది. ఆ విధంగా సభ సక్సెస్ కావడమే కాకుండా, రాష్ట్రం’ పై బీజేపీ ఫోకస్ ఎంత బలంగా  వుందో, జతేఅయ్ స్థాయిలో  బీజేపీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటో  చెప్పకనే చెప్పినట్లయింది.అంతే కాదు, కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి ప్రసంగించిన మోడీ, ఇది వన్ టైం ఎఫైర్ కాదు, ఈ దండ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలని సూచించారు. సో.. ఇలాంటి యాత్రలు, దండయాత్రలు ఇలా కొనసాగుతూనే  ఉంటాయి, అనే సంకేతం అయితే వచ్చింది. 

ఓవరాల్’’గా చూస్తే, బీజేపీ, తెరాసల మధ్య సాగుతున్న వ్యూహాత్మక యుద్దంలో ప్రస్తుతానికి అయితే బీజేపీ పై చేయి సాధించింది. అయితే, ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, వ్యూహాలు మార్చుకునేందుకు తెరాసకు ఇంకా సమయం ఉందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, కేంద్రంపై యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన కేసీఆర్, వెనకడుగు వేస్తారా,  అంటే రాజకీయ పరిశీలకులు మాత్రం అనుమానమే అంటున్నారు.

By
en-us Political News

  
మ‌ళ్లీ  రిజ‌ర్వు బ్యాంక్ నుంచి మ‌రో వెయ్యికోట్లు రుణ స‌మీక‌ర‌ణ చేశారు. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. దీనిప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. 
ఒక పోలీసాయ‌న‌.. రాత్రి కాస్తంత పొద్దు బోయాక ఇల్లు చేరాడు. టోపీ తీసి టేబుల్ మీద ప‌డేసి అలానే మంచం మీద ప‌డుకున్నాడు. చాలాసేప‌టికి ఇంట్లో వారు లేపితే కాస్తంత తిని ప‌డుకు న్నాడు. అంత‌లో పేద్ధ శ‌బ్దం. బ‌య‌ట‌పెట్టిన టూవీల‌ర్ పేలిపోయింది. ప‌రుగున పోలీసాయ‌న బ‌య‌టికి వ‌చ్చేడు. బండి కాలి బొగ్గ‌యింది. త‌న‌కు తెలిసిన వెధ‌వ‌ల్ని త‌ల‌చుకున్నాడాయ‌న‌. . ఇది చాలా స‌హ‌జంగా మ‌నం చూసే సిని మాలో సీన్‌. స‌రే ఆన‌క ఆయ‌నే బెల్టు స‌ర్దుకుని వెంటాడి వాడేవ‌డినో ప‌ట్టేసుకుంటాడు. కానీ ఈమ‌ధ్య అమృత్‌స‌ర్‌లో దాదాపు ఇదే సీన్ కానీ ఇంతగా ఏమీ జ‌ర‌గ‌లేదు. కార‌ణం ఓ కుక్క‌!
చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీద‌నే కాల్పులు జ‌రిపి పారిపోయాడీ ఘ‌నుడు. అలా వెళ్లిన‌వాడు నిన్న‌నే భార‌త్-నేపాల్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ప‌ట్టుబ‌డ్డాడు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు. దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఎ ఎస్ అధికారి క‌నుక గుజ‌రాత్ ప్ర‌భుత్వ నిర్వాకం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌పోయారు  
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోలేకపోవడానికి ఆ పార్టీ స్థానిక నేతల్లో అనైక్యతే కారణమనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఉన్నాయి. మళ్లీ ఇంత కాలానికి పార్టీ జవసత్వాలు కూడదీసుకుని అధికార రేసులో బలంగా నిలిచిన తరుణంలో మళ్లీ అనైక్యత జాడ్యం మరోసారి జడలు విదిల్చి రంగంలోకి దూకింది.
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష ప‌డిన 11మందీ జైల్లో ఎంతో స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో మెలిగార‌ట‌. అంచేత వారిని విడిచిపెట్టారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం లేకపోవడాన్ని పరిశీలకులు సైతం అనూహ్య పరిణామంగానే పరిగణిస్తున్నారు. మోడీ కేబినెట్ లో అమిత్ షా తరువాత గట్టిగా వినిపించే పేరు నితిన్ గడ్కరీ మాత్రమే. అంతే కాదు ఆయన నాగపూర్ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. నాగపూర్ పెద్దలు అనగానే ఆర్ఎస్ఎస్ కీలక నేతలు అన్న విషయం తెలిసిందే. మోడీ 2.0కు ముందు ప్రధాని పదవి కోసం ఆర్ఎస్ఎస్ నితిన్ గడ్కరీ పేరును ఒకింత సీరియస్ గానే పరిగణించింది.
విద్యుదుత్ప‌త్తి సంస్థ‌ల నుంచి రోజూ కొంటున్న విద్యుత్‌కు బిల్లులు స‌కాలంలో చెల్లించాలి. కానీ  ఏపీ స‌ర్కార్ అలా చేయ‌లేద‌ని చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి కేంద్రం నిర్ణ‌యించింది.
ఒక వైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేస్తూ రాకెట్ వేగంతో దూసుకు పోతుంటే.. మరో వైపు పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి స్పీడును అందుకుంటూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పరుగులు తీస్తున్నారు. ఆయనకు పార్టీ బలోపేతంతో పాటు మంగళగిరిలో తన విజయానికి బాటలు వేసుకోవడమన్న అదనపు బాధ్యత కూడా ఉంది. ఎక్కడైతే పరాజయం ఎదురైందో అక్కడే తన విజయాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో లోకేష్ ముందుకు సాగుతున్నారు.
సింహాచ‌లం వ‌రాహ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి దేవ స్థానానికి చెందిన పంచ‌గ్రామాల భూము ల్ని ఆక్ర‌మ‌ణ‌దారుల పేరు మీద  క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. అందుకు ఏకంగా చ‌ట్టం కూడా తెచ్చింది. హై కోర్టు ఆగ్ర‌హించింది
వచ్చే ఏన్నికలలో టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు సమరసన్నాహాలు చేస్తున్నారు. మినీ మహానాడు కార్యక్రమాల పేరుతో ఒక్కో జిల్లాలో మూడేసి రోజులు పర్యటించిన చంద్రబాబు నాయుడు తాజాగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు ప్రారంభించారు.
ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఉపాథ్యాయుల హాజరు కోసం ప్రభుత్వం తప్పని సరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం, దాంట్లో లగిన్ అవ్వడం తప్పని సరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.