కేసీఆర్ హస్తిన బాట.. అజెండా మాటున బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు వ్యూహాలు

Publish Date:May 10, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి హస్తిన బాట పట్టనున్నారా? ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆయన ప్రవచించిన జాతీయ అజెండా కు మద్దతు కోసం మళ్లీ ఫ్రెష్ గా ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఒక ప్రముఖ దినపత్రికలో ముఖ్యమంత్రి సీపీఆర్వో (ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి) వనం జ్వాలా  నరసింహరావు రాసిన వ్యాసం చదివితే ఔననే సమాధానం వస్తుంది. ఇక ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాక జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారన్నది అవగతమౌతుంది.

ఇందుకు తగ్గట్టుగానే  టీఆర్ఎస్ కార్యనర్వాహక  అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రభుత్వ కార్యక్రమాలలో అన్నిటా తానై వ్యవహరిస్తున్నారు. మంత్రులు చేయాల్సి ప్రారంభోత్సవాలను కూడా ఆయనే చేసేస్తున్నారు. ఏ హోదాలో కేటీఆర్ ఇదంతా చేస్తున్నారన్న సందేహం ఎవరికైనా కలగొచ్చేమో కానీ టీఆర్ఎస్ లో మాత్రం అలాంటి అనుమానాలు ఎవరికీ రావు. ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం తరువాత ఒక ప్రముఖ దినపత్రికలో  సీఎం సీపీఆర్వో రాసిన వ్యాసం చదివితే.. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ స్థాయిలో తన ముద్రవేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు భావించాల్సి వస్తుంది. 
అందుకే ఇటీవలి కాలంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆయా శాఖల మంత్రులతో సంబంధమే లేకుండా ప్రారంబోత్సవాలకు హాజరౌతున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటనలూ ఆయనే చేస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద ఉన్న శాఖల వ్యవహారాలూ ఆయన చూస్తున్నారు.

అంతే కాకుండా ఇటీవలి కాలంలో ఆయన భాషలో ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తున్నది. యాసలో కానీ, ఉపయోగించే పరిభాషలో కానీ తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుకరిస్తున్నారు. విమర్శలలో పదును పెంచారు. తండ్రికి రాజకీయ వారసుడిగా జనంలో గుర్తింపు పొందేందుకే ఆయన తన ఆహార్యాన్ని, భాషనూ మార్చుకుంటున్నారు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుంటే కేసీఆర్ ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడం ఖాయమేననిపించక మానదు. టీఆర్ఎస్ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని చెబుతున్నారు.  వారి మాటల ప్రకారం..ప్రస్తుతం ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్, ఈ నెల 14వరకూ అక్కడే ఉంటారు. ఆ తరువాత ఆయన హస్తిన బాట పట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. 

జాతీయ అజెండా అంటూ తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశ వ్యాప్తం చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించినా.. కేసీఆర్ వ్యూహం  మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీయేతర శక్తుల ఏకీకరణేననీ, దానికి ఫంట్ర్ లు, కూటములు అంటూ రాజకీయ భాష వాడకుండా జాతీయ అజెండా నామకరణం చేశారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అజెండా పేరిట బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకువస్తే... ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆయన భావనగా చెబుతున్నారు.  ఏది ఏమైనా మొత్తం మీద  ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని అంటున్నారు. ఇందుకు ఆయన మీడయా మద్దతు కూడగట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక ప్రముఖ దినపత్రికలో సీఎం సీపీఆర్వో కేసీఆర్ ఆలోచనలు, లక్ష్యాలను వివరిస్తూ రాసిన సుదీర్ఘ వ్యాసం అని  విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాలలో తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి ప్రాంతీయ పత్రికల మద్దతు సరిపోదు కనుక ఆయన జాతీయ మీడియాలో తన అజెండా ప్రత్యేకతలు ప్రసారం కావాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఢిల్లీలో తన పీఆర్వోను నియమించారు. ఆయన ద్వారా జాతీయ మీడియాలో కూడా తన ప్రస్తావన ప్రముఖంగా వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే  కొన్ని జాతీయ చానెళ్లలో కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ అజెండాపై ప్రముఖంగా వార్తా కథనాలు ప్రసారమవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు.

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.