లోకేష్ తమ్ముడు.. పవన్ అన్నయ్య..కేటీఆర్ మళ్లీ మొదలెట్టేశారు!

Publish Date:Nov 11, 2023

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మంచి మాటకారి. అందులో ఎలాంటి సందేహం లేదు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడగల వక్తగా కూడా కేటీఆర్ కు మంచి పేరుంది. తండ్రి కేసీఆర్ ఓ స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల మాటకారి కాగా.. కుమారుడు కేటీఆర్ మరో స్థాయి వర్గాన్ని ఆకట్టుకోగల నేర్పరి. కానీ, ఎంతటి మేధావి అయినా ఒక్కోసారి తడబాటు తప్పదు.. ఎంత నేర్పరి అయినా ఒక్కోసారి మాట జారక తప్పదు. అలాగే కేటీఆర్ కూడా పరిస్థితి ఏంటన్నది అంచనా వేయక పుసుక్కున నోరు జారేశారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకొనే క్రమంలో అదే మాటకు కట్టుబడి ఉన్నామనేలా మాట్లాడేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించి మీ రాష్ట్రంలో నిరసనలు చేసుకోండని మాట్లాడారు. అది కాస్త ఆంధ్రా సెటిలర్లకు కోపం తెప్పించింది. 

ఆ తర్వాత అప్పటికప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలపై దిద్దుకొనే అవకాశం ఉండగా పరిస్థితి అంత దూరం వెళ్తుందనే అంచనా లేకనో.. ఇంకా తెలంగాణలో చంద్రబాబు అవసరం ఏముందిలే అనుకున్నారో కానీ చంద్రబాబు అరెస్టును ఖండించాల్సిన సమయంలో ఆయన అభిమానుల నిరసనను తప్పుబట్టారు. దీంతో సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులలో కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పైనా ఆగ్రహం పెల్లుబికింది. ఆ తర్వాత పరిస్థితి అర్ధం చేసుకున్న కేటీఆర్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అసలే గత పదేళ్లుగా తెలుగుదేశంపై బీఆర్ఎస్ వైఖరి, గత ఎన్నికలలో జగన్ తో కలిసి తెలుగుదేశం ఓటమికి కారణమైందన్న భావనకు తోడు  ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు కలిసి ఆంధ్రా సెటిలర్లలో బీఆర్ఎస్ నూ నమ్మకం కోల్పోయేలా చేశాయి. కానీ, కేటీఆర్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఆ మధ్య చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ కు బదిలిస్తూ సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్‌ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్‌ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తాను అన్న మాటలను కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. 

ఆ తర్వాత మరోసారి కేటీఆర్ చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ  వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసినా 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని చెప్పారు. ఇక తెలుగుదేశంపై విమర్శలకు తావేలేదంటూ తెలంగాణలో సెటిలర్లకు, తెలుగుదేశం సానుభూతి పరులకు  దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ తనకు తమ్ముడని.. పవన్ కళ్యాణ్  అన్నయ్య అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కేటీఆర్.. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కేసీఆర్ కు గానీ, తనకు గానీ ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యం గురించి లోకేష్ తో మాట్లాడానని కూడా కేటీఆర్ చెప్పారు. బాబుపై కక్ష సాధించే ఆలోచనే కేసీఆర్ కు లేదని అన్నారు. ప్రచార రథం మీద నుంచి తాను పడ్డ తర్వాత లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని కేటీఆర్ వెల్లడించారు.

ఇక పనిలో పనిగా లోకేష్ తనకు తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నయ్య లాంటి వారంటూ ఇటు టీడీపీ, అటు జనసేనలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసే కేటీఆర్.. ఈ ఎన్నికలలో మాత్రం అంతా చేయి జారిపోయాక మేల్కొన్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు ఇక ఎంత సోప్ వేసినా ఆంధ్రా సెటిలర్లు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని.. ముఖ్యంగా  తెలుగుదేశం అభిమానులు బీఆర్ఎస్ కు దగ్గరవడం  అన్నది జరిగే పరికాదనీ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.