కేసీఆర్ తో రైతు ఉద్యమ నేత రాకేశ్ తితాయత్ రహస్య భేటీ..? ఆంతర్యమేమిటి?

Publish Date:Jul 8, 2022

Advertisement

కేసీఆర్ వ్యూహాలేమిటి? ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ దాటి బయటకు రాకుండా ఆయనేం చేస్తున్నారు? టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఈ సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆయన తన జాతీయ రాజకీయ ప్రవేశంపై వ్యూహాలకు పదును పెడుతున్నారనీ, ఎన్ని అవాంతరాలెదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా ముందుకే అడుగేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన వాళ్లు చెబుతుంటారు. ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభ  మసకబారుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ రాకను స్వాగతించే వారెవరూ కనిపించడం లేదు. అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదు. మరేం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సంపూర్ణంగా కాకున్నా..  ఏదో ఒక మేరకు బదులు అనిపించే ఉదంతం ఒకటి గురువారం సంభవించింది. మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసనగా   సుదీర్ఘ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్, ఆయన అనుచరుడు యుధ్వీర్ సింగ్ లో కలిసి గురువారం సాయంత్రం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రంయలో దిగిన వీరిరువురూ అక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే వీరిని స్వయంగా పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు.  భేటీ అనంతరం వీరిరువురూ సీఎం క్యాంప్ ఆఫీసులోనే బస చేసినట్లు సమాచారం.ఇంతకీ రెండున్నర గంటల పాటు అత్యంత రహస్యంగా జరిగిన భేటీలో ఏం చర్చించారు? ఆ వివరాలు, అసలు భేటీ వివరాలూ బయటకు రాకుండా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదంటున్నారు. ప్రగతి భవన్ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ భేటీలో రైతు సమస్యలపై రైతులతో చైతన్యం తీసుకురావడం, గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమలో అనుసరించిన పంథా, రైతులను మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏకం చేయడం ఎలా అన్న విషయాలపై వీరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.  మొత్తంగా మోడీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ శక్తులు కలిసి రాకున్నా రైతులను చైతన్య వంతులను చేసి వారిని ఉద్యమోన్ముఖులను చేసి వారికి నాయకత్వం వహించేలా కేసీఆర్ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్, యుధ్వీర్  సింగ్ లను పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో రహస్యంగా భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా శుక్రవారం సాయంత్రం కూడా కేసీఆర్ తో వీరు చర్చించినట్లు సమాచారం.
 

By
en-us Political News

  
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.