మిత్రులారా..! విజ‌య‌మో.. వీరావేశ‌మో తేల్చుకుందాం!!

Publish Date:Jun 14, 2022

Advertisement

మూర్ఖ‌పు రాజును గ‌ద్దె దింప‌డానికి  ఇత‌ర రాజ్యాల‌వారు క‌ల‌వ‌డం అనివార్యం. అయితే  అదీ గొప్ప యుద్ధ వ్యూహ ర‌చ‌న‌తోనే జ‌ర‌గాలి. వూరికే క‌లిసి టిఫిన్ చేసి నాలుగు క‌బుర్లు చెప్పుకోవ‌డం కాకుండా ప‌క‌డ్బందీగా  ఒక మాట అనుకుని అంద‌రూ క‌లిసి ముంద‌డుగు వేయాలి. అపుడే ల‌క్ష్యం సిద్ధిస్తుంది. రాజు మొండివాడ యినా న‌లుగురి ఆలోచ‌న మొండివాడికీ బుద్ధి వ‌చ్చేట్టు చేస్తుంది. కానీ  అందుకు ధైర్యంగా ముంద‌డుగు వేయాలి. అదీ ఏ ఒక్క‌రిద్ద‌రో చేస్తే  కుద‌ర‌దు. కానీ మొండివాడికి  వీరి ర‌హ‌స్యాలు తెలిసి  వుంటేనే  క‌ష్టం. అలాంట‌పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ప‌రిశీలించాలి. ఎందుకంటే మొండివాడు ఎప్ప‌టిక‌యినా ప్ర‌మా ద‌మే. 

దేశంలో బిజెపి ప్ర‌భుత్వానికి జాతీయ‌స్థాయిలో గ‌ట్టి ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం బాగా క‌లిసివ‌చ్చింద‌నాలి. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వ విధానాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏదో ఒక సంద‌ర్భంలో ఎండ‌గ‌డుతున్నా యి.  ఎప్ప‌టికప్పుడు ఎదిరించాల‌నుకుంటున్నాయి. కానీ ఏదీ  కార్యాచరణ  దాకా రావడం లేదు. క‌నుక కాం గ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా  కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టి బిజెపీకి గ‌ట్టి  షాక్ ఇవ్వాల‌నే నిర్ణ‌యించుకు న్నారు. అయితే అందుకు న‌లుగురినీ కూడ‌గ‌ట్టుకోవాలి. అందుకు ఎవ‌రు క‌లిసి వ‌స్తారు? ప‌క్క‌నే వున్న తెలుగు రాష్ట్రం వైసీపీ ప్ర‌భుత్వం అందుకు ముంద‌డుగు వేసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేని  స్థితిలో వుంది.  అందుక్కార‌ణం వారి ర‌హ‌స్యాల‌న్నీ కేంద్రానికి ఎరుక గ‌నుక‌!  అస‌లే  ఈడీ చుట్టు ప్ర‌ద‌క్షిణాల‌తో గ‌డుపుతున్న ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ రెడ్డి కేంద్రంలో బిజ‌పీ ప్ర‌భుత్వాన్ని ఎదిరించే సాహ‌సం ససెమీరా చేయ‌లేరు. అస‌లు ఈడీ, ఐటీ శాఖ‌లు  ప్ర‌ధాని మోదీ, బిజెపీ అధినేత షా  జేబులో వుండ‌టంతో ఎవ‌రు మాత్రం ధైర్యం చేస్తారు. కాదు కూడదు అనుకుంటే ఒక్క అడుగు ముందుకేసినా, ఒక్క ఆలోచ‌న‌తో కేంద్రం వేపు చూసినా మ‌ర్నాడు ఉద‌యం తెల్లారుతూనే ఈడీ స‌మ్మ‌న్లు గేట్లో ప‌డుంటాయి!  ఇక  ధైర్యం నీరుగాక  ఛ‌స్తుందా? 
కేసీఆర్ ధైర్యంచేసి మోడీపై  డైరెక్ట్ అటాక్  చేస్తుంటే..ఇదంతా లాలూచీ కుస్తీ  అనే  చాలామంది అనుకు న్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా ఇది లాలూచీ కుస్తీ కాదు.. సీరియస్ పోరాటమే అనే సంకేతాలు ఇవ్వడానికి  కేసీఆర్ ప్ర‌యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు రూపంలో కేసీఆర్ కు ఓ అస్త్రం దొరికింది.

తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ కు ఇంకో అస్త్రం కావాలి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మోడీని, బీజేపీని ఎంత విమర్శించినా పెద్దగా మైలేజ్ రాదు.దేశం కోసం నేను బీజేపీకి వ్యతిరేకంగాపోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వండి" అని ప్రజలకు అప్పీల్ చేయడం కేసీఆర్ కు తేలిక. ఇది అటు లోక్ సభ స్థానాలే కాదు.. అసెంబ్లీ  స్థానాలుగెలవడానికి కూడా జాతీయపార్టీ అనేది కేసీఆర్ కు ఉప‌యోప‌డుతుంది. ఒకవేళ మోదీ  షా తెలం గాణ  అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్ సభకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లినా..మోడీ హవాని  తెలంగాణలో ఆపడానికి కేసీఆర్  పెట్ట‌బోయే  కొత్త  జాతీయ పార్టీ ఉపయోగపడుతుంది. ఒక జాతీయ పార్టీని  ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ కు  వస్తే ప్రధానమంత్రి  అనే కొండ వస్తుందనే ఆశ. ఆ  కొండ రాకపోతే  కనీసం రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడానికి అయినా ఉపయోగపడుతుందనే ఎత్తు గడ.  అందుకే  కేసీఆర్ జాతీయపార్టీ  ఆలోచన  చేస్తున్నట్లు భావించొచ్చు.

ఇక  పీకే  విషయానికొస్తే.. ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పనిచేస్తున్నాడా..నిజంగానే  కేసీఆర్  మీద నమ్మకంతో  పనిచేస్తున్నాడా అనేది ఇంకొద్ది రోజుల్లో  తేలిపోతుంది. పీకే  గనుక కేసీఆర్ పెట్టే పార్టీలో చేరి బాధ్యతలు తీసుకుంటేనమ్మకం ఉన్నట్లు స్పష్టమవు తుంది. ప్రశాంత్ కిషోర్ కు చాలా రాజకీయ ఆశలు న్నాయి. అంతకుముందు నితీష్ కుమార్ కి  చెందిన జేడీ(యు) లో అయన కొన్నాళ్లున్నారు.  తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఇప్పుడు బీహార్ లోపాదయాత్ర చేస్తున్నారు. మత తత్వ అజెండా స్థానంలో ప్రజా స్వామ్యానికి చోటు ఉండదు.

రాజకీయంగా ఎదగాలని ఆశ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సలహాలతో కేసీఆర్ స్థాపిస్తున్న పార్టీలోచేరడంపై అభ్యంతరం ఉండకూడదు. కేసీఆర్కు పీకే కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానే ఉండిపోతే ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పని చేస్తున్నట్లు అనుకోవచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల  ప్రజలకి మాత్రం కొంత మంచి జరిగే అవకాశం ఉంది.

బీజేపీని గట్టిగా నిలదీసే ఒక కొత్త గొంతు దేశానికి దొరుకుతుంది. రాజకీయ చర్చల్లో మతతత్వ అజెండా స్థానంలో కొద్దిగా అయినా ప్రజల సమస్యలు అజెండాగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్  కొత్త పార్టీ వల్ల ప్రజలకు ఏమేలు జరుగుతుందో చూడాలి. 

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.