కాశ్మీర్ లో చేశారు.. ఇక్కడెందుకు చేయరు!.. నియోజకవర్గాల పునర్విభజనపై కేసీఆర్ గళం

Publish Date:May 11, 2022

Advertisement

కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ మరో వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణలో నియోజకవర్గాలను పెంచాలని గళమెత్తాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో  అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఉంది. దీని కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మిన్నకున్నారు. 
అయితే ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఆ ఆంశాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందు కోసం కేంద్రంపై లేఖాస్త్రాలు సంధించాలని యోచిస్తున్నారు. ఇప్పుడింత హఠాత్తుగా నియోజకవర్గాల పెంపు విషయం కేసీఆర్ఎందుకు లేవనెత్తుతున్నారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ డిమాండ్ ను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని తెలిసినా కేసీఆర్ నియోజకవర్గాల పెంపుపై   పట్టుబడుతున్నారు.

ఎందుకంటే ఇటీవలే కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా చేసి నియోజకవర్గాల డీ లిమిటేషన్ కూడా పూర్తి చేసేసింది. దానికి ఆమోద ముద్ర వేసి ఎన్నికలు జరిపించడమే తరువాయి. అక్కడ ఆఘమేఘాల మీద చేసేశారు, తెలుగు రాష్ట్రాలవిభజన జరిగి ఎనిమిదేళ్లయినా, విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశం స్పష్టంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని చేయరని ప్రశ్నిస్తూ కేంద్రంపై లేఖాస్త్రాలను ప్రయోగించడం ద్వారా మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

కేసీఆర్ డిమాండ్ పై కేంద్రం స్పందించినా, స్పందించకున్నా.. నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావిండం ద్వారా తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్నదే కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు అంశంపై గతంలో కూడా రెండు రాష్ట్రాలూ డిమాండ్ చేశాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గాల పెంపు కోసం అప్పటికి మిత్రపక్షమైన బీజేపీతో పెద్ద యుద్ధమే చేశారు. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల పెంపు జరగాల్సిందేనని పట్టుబట్టారు.

అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాలను పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అప్పట్లో కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం మెల్లిమెల్లిగా మరుగున పడింది. ఇప్పుడు కాశ్మీర్ లో నియోజకవర్గాల డీ లిమిటేషన్ తో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.