కేటీఆర్ కోరికలకు కేసీఆర్ కళ్ళెం ?

Publish Date:Jul 19, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తద్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి,  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.  

అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం, ఇక ఈసారికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేనట్లేనని అంటున్నారు. అదే విషయాన్ని వాళ్ళు వీళ్ళూ కాకుండా మంత్రి కేటీఆరే స్వయంగా వెల్లడించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని స్వయంగా ప్రకటించారు.ఇటీవల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్  వచ్చే ఎన్నికల్లోనూ తెరాస 90 ప్లస్ సీట్లు తెచ్చుకుని. అధికారంలోకి వస్తుందని చెప్పు కొచ్చారు. అది ఎంత నిజమో  ఏమో కానీ కేటీఆర్ అక్కడితో ఆగకుండా, దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ఇంకో మాట జోడించారు. సరే మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వస్తే మాత్రం మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్  స్పష్టంగానే చెప్పారు. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి కేటీఆర్ ఒక్కరే కాదు, గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా చెప్పిన నాయకులతో సహా తెరాస నాయకులు గత కొంత కాలంగా ఇదే విషయం చెపుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు  కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని తెరాస నేతలు టీవీ చర్చలలో ఇతరత్రా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్వయంగా అదే విషయాన్ని శంఖంలో పోశారు.  సో .. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైతే కేటీఆర్ ముఖ్యమంత్రి ‘కుర్చీ’ కోరికకు కళ్ళెం వేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీలోనూ అదే చర్చ జరుగుతోందని అంటున్నారు. 

అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. వేషం కాకపోయినా భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారని, తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.  

కానీ, ఇప్పుడు కేటీఆర్ ఎందుకు  ‘యు’ టర్న్ తీసుకున్నారు? అంటే  అందుకు సర్వేలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా  ప్రశాంత్  కిశోర్ బృందం పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఏమిటి? అనే విషయంగా నిర్వహించిన ‘ప్రత్యేక’ సర్వేలలో, తెరాసను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధిక శాతం ప్రజలు, కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేశారు.  పీకే సర్వేతో పాటుగా ఇతర  సర్వేలలోనూ, తెరాసను వ్యతిరే కిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది, ప్రదానంగా కుటుంబ వారసత్వ రాజకీయాలను. కుటుంబ అవినీతిని  వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. అలాగే, కేంద్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున విషయం తేట తెల్లమైందని  తెలుస్తోంది.

ఈ నేపధ్యంలోనే ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ కూడా, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు,ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ ముఖ్యమత్రి  రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా, మహారాష్ట్ర పరిణామాల అనంతరం, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట బహిరంగంగా వినిపిస్తున్న నేపధ్యంలో  ఇప్పడు నాయకత్వ మార్పు జరిగితే,  బీజేపీ సహకారంతో  తెరాసలో షిండేలు పుట్టుకు రావచ్చనే అనుమానాల చేతనూ  ప్రస్తుతానికి, యథాతథ స్థితి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ మేరకు  కేసీఆర్, కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చారని అంటున్నారు.

అదొకటి అలా ఉంటే, నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా కుటుంబంలో ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించక పోవడానికి కూడా ఇదే కారణంగా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోరుకున్నదే ప్రశాంత్  కిశోర్  సర్వేలు చెప్పాయి. మరో వంక, మహారాష్ట్ర పరిణామాలు కూడా కలిసొచ్చాయి. అలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, కేటీఆర్ నోటి నుంచే ‘హ్యాట్రిక్’ పలుకులు పలికించారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అవును  కేసీఆర్  రాజకీయ చతురత గురించి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన  అవసరం లేదు. కానీ, చెప్పుకోక తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్  చాలా కాలంగా కుటుంబంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కున్నా, చివరాఖరుకు కుటుంబ రాజకీయాల్లోనూ పై చేయి సాధించారని, కేటీఆర్  కోరికలకు కళ్ళెం వేయడంలోనూ అయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

By
en-us Political News

  
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.