ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్: నారా లోకేష్ ఎవరి సినిమా మొదట చూస్తారు?

Publish Date:Jun 30, 2026

Advertisement

ఆ సాయంత్రం...

రాక్సీలో నార్మా షేరర్‌,

బ్రాడ్వేలో కాంచనమాల;

ఎట కేగుటో సమస్య తగిలిం దొక విద్యార్థికి!
ఇవి మహాకవి శ్రీశ్రీ రాసిన సంధ్యా సమస్యలు కవితలోని పంక్తులు.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొన్నారు. నారా లోకేష్.. యువతలో, అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ తో  ఎప్పుడూ టచ్ లో ఉండే లోకేష్  తాజాగా.. టీనేజర్లు, యువతతో ఓ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా  తమదైన శైలిలో  లోకేష్‌ను సరదా ప్రశ్నలతో టీజ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే యువత ప్రశ్నలకు లోకేష్ వారి కంటే సరదాగా.. ఎదురు వారినే టీజ్ చేసేలా ఆసక్తికర సమాధానాలిచ్చారు. 

ఈ క్రమంలోనే లోకేష్ అత్యంత క్లిష్టమైన, అంతకు మించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదుర్కొన్నారు.  అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్..  అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు. పైకి సరదాగా కనిపించినా.. ఈ ప్రశ్న రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నగానే భావించాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. పవన్ కల్యాణ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్.. నందమూరి వంశానికి చెందిన స్టార్ హీరో.  ఈ ఇరువురిలో ఏ ఒకరి సినిమా ముందుగా చూస్తానని లోకేష్ చెప్పినా దానికి రాజకీయ రంగు పులమడానికి ఆయన ప్రత్యర్థులు రెడీగా ఉంటారు. అయితే వారికి అటువంటి అవకాశం ఇసుమంతైనా ఇవ్వకుండా లోకేష్ సమయస్ఫూర్తితో లౌక్యంగా ఇద్దరి సినిమాలూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. యూత్ సరదా ప్రశ్నకు లోకేష్ ఇచ్చిన స్మార్ట్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. 

ఇది ఒక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దేశ ప్రధానిగా  చూడాలనుకుంటున్నారా,  రాష్ట్రపతిగా చూడాలని ఉందా అన్న ప్రశ్నకు లోకేష్ అనితర సాధ్యమైన రీతిలో..  ఆ రెండు పదవులు కాకుండా, చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉంటూ, తాను ఎల్లప్పు డూ చేసే విధంగానే నవ్యాంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపించడమే తనకు ఇష్టమని బదులిచ్చారు.  ఇక ఆహారంలో తనకు రాగి సంకటి అత్యంత ఇష్టమని లోకేష్ చెప్పారు. పొలిటికల్ గా 2029 ఎన్నికలలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.  

By
en-us Political News

  
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.