కేసీఆర్ రాజకీయ వ్యవసాయం.. ఆ మూడు రాష్ట్రాలపైనే గురి!

Publish Date:Sep 1, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఒక ఎత్తుగడ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్  26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులను హైదరాబాద్ కు పిలిపించుకుని, మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. విందు వినోదాలతో చక్కని ఆతిధ్య మిచ్చారు. శాలువాలు కప్పి సన్మానాలు చేశారు.  ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ మూడు రోజుల రైతు వేడుకలకు, సర్కార్ ఖజానా నుంచి తెలంగాణ ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు  ఖర్చైదో, ఏమో మనకు తెలియదు. ఎందుకంటే శ్రీ సర్కార్ వారు చెప్పలేదు. చెప్పరు. అదొకటి అలా ఉంటే, అన్ని రాష్ట్రాల రైతు నాయకులను విమానాలు ఎక్కించి తీసుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఒక్క ఆహ్వానం పంపిస్తే రెక్కలు కట్టుకుని వచ్చి వాలే, తెలంగాణ రైతు రైతు సంఘాల నాయకులను మాత్రం ఎందుకనో పిలవలేదు.  ఎందుకనో ఏముంది , పిలిస్తే, అందరి ముందు అసలు బండారం బయట పడుతుందనే. అందుకే రాష్ట్ర రైతులను రైతు వేడుకలకు దూరంగా ఉంచారని అంటున్నారనుకోండి అది వేరే విషయం.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందు కోసం దేశంలో ఉన్న రైతు నాయకులు అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే, అందుకు సమాధానం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాలపై కేంద్రీకృతమై వుంది. రాష్ట్రంలో వీస్తున్న ఎన్నికల ఎదురు గాలిని తట్టుకోవాలన్నా, రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడాలన్నా, మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణల ఉచ్చులోంచి బయటపడాలన్నా, జాతీయ రాజకీయాల పంచన చేరడం మినహా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఏదో విధంగా జాతీయ రాజకీయాలలో గుర్తింపు కోసం ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అందులో భాగంగానే,  వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను రప్పించి వారిచేతే, ఆహా వోహో అనిపించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

జాతీయ రాజకీయాలలో కూసింత గుర్తింపు కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్,బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు మొదలు, బీజేపీ ముక్త భారత్ నినాదంతో కొత్త పార్టీ లేదా ఫ్రంట్ ఏర్పాటు వరకు ఆయన చేయని ప్రయత్నం ఏదీ లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జాతీయ పత్రికలు మీడియాలో ప్రచారం చేసుకున్నారు,. అదొకటనే కాదు,ఒక విధంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కాసింత గుర్తింపు కోసం రాజకీయ అష్టావధానం, శతావధానం ఒకేసారి చేస్తున్నారు..అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ఎన్నికల్లో, భారత  రైతు సమితి (బీఆర్ఎస్) పేరిట రైతు నాయకులను ప్రయోగాత్మకంగా బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అందుకోసమే జాతీయ స్థాయిలో రైతు వేదిక ఏర్పాటు పేరిట  జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 

అలాగే, ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకోవడంలోనూ కేసీఆర్ మార్క్ రాజకీయం ఉన్నది అంటున్నారు. . ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. తెలంగాణలో అమలవుతున్న రైతు భీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలను ప్రచారం చేసుకోవడంతో పాటుగా బీజేపీ వ్యతిరేక  ప్రచారం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీజేపీ నేతలు గుజరాత్ మోడల్ పేరుతో జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు.

ఇప్పుడు అదే విధంగా తెలంగాణ మోడల్‌ను తెరపైకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల్లో రైతుల నేతలు అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ మూడు రాష్ట్రాలలో ప్రచారం చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ పై  చర్చ జరిగేలా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అది సాధ్యమేనా? ఒక జాతీయ పార్టీతో పట్టుమని పది పార్లమెంట్ స్థానాలు లేని ఒక ప్రాంతీయ పార్టీ పోటీ పడటం అయ్యే పనేనా , అంటే, ఏమో ..  గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.