తెలంగాణకు ఓజీ కేసీఆరే.. పవన్ కల్యాణ్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Publish Date:Jun 3, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం, హక్కుల పోరాటంపై   దుమారం రేగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు  ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడున్న నాలుగున్నర కోట్ల మంది  భూమి పుత్రుల జాగీరని ఆయన స్పష్టం చేశారు. ఈ గడ్డపై ప్రతి అంగుళం ఇక్కడి ప్రజల స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి ప్రతీక అన్న కేటీఆర్.. తెలంగాణకు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడి ప్రజల సార్వభౌమత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇటీవల పవన్ కల్యాణ్  తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేటీఆర్..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున పవన్ కల్యాణ్ సభ పెట్టాలనుకోవడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ..  అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, ఇక్కడి పరిపాలనకు ఎప్పటికీ  ఓజీ  అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణకు ఇంకెవ్వరి పెత్తనమూ అవసరం లేదనీ కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనదిగా పవన్ కల్యాణ్ అభివర్ణించడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం నుండి ఆంధ్రుల హక్కుల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాటం కూడా ప్రాంతీయవాదమే అవుతుందా అని ప్రశ్నించారు. ప్రాంతీయ హక్కుల కోసం పోరాడటం ఉగ్రవాదమా అని నిలదీశారు. జాతీయవాదం  ముసుగు వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావలసిన ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలను, ప్రాజెక్టులను తన స్వరాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని 'ఆర్థిక ప్రాంతీయవాదం' అనరా అని కేటీఆర్ నిలదీశారు.

దేశంలో ఎవరికైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందన్న కేటీఆర్.. జనసేన పార్టీ తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేమీ లేదనీ..  గతంలో జరిగిన 2018,  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేశారనీ గుర్తు చేశారుర.  

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌కు గౌరవం ఇస్తామనీ,  ఒక కళాకారుడిగా, సినీ నటుడిగా ఆయనకు ఉన్న అభిమానులను తాము గౌరవిస్తామనీ, అయితే.. హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్‌లోకి వచ్చి ఇక్కడి పాలనపై పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఇక్కడి నాలుగున్నర కోట్ల మంది ప్రజలు  ఊరుకోరని కేటీఆర్ హెచ్చరించారు. 

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఆ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎంపికయ్యే అభ్యర్థుల పేర్లు ఏమిటన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అది పక్కన పెడితే.. జనసేన అభ్యర్థిగా సీఎం నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైనంది.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే నేత ఇలంగోవన్ బహిరంగంగానే ఆరోపించారు. తమ మద్దతుతోనే రాజ్యసభ నామినేషన్లు దక్కించుకుని.. కూటమి ద్వారానే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు స్వార్థం రాజకీయంతో వేరే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.