Publish Date:Oct 13, 2018
అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్ మళ్ళీ అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.కానీ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు నిరసన గళం వినిపించటంతో ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.ఓ పక్క మహాకూటమి,మరో పక్క అభ్యర్థులపై అసంతృప్తి నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.ప్రతి నియోజక వర్గంలో బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం చేసేవిధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు.దాదాపుగా 56 నియోజకవర్గాలకు ప్రచార తేదీలు ఖరారయ్యాయి. మిగిలిన వాటి గురించి రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ స్వయంగా నియోజకవర్గ నేతలతో ఫోన్‌లో మాట్లాడి ప్రచారానికి అనువైన తేదీ గురించి వారితో చర్చించి ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గాల వారీ ప్రచార సభల సందర్భంగా స్థానిక నేతలతో భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను నేరుగా తెలుసుకోవడంతో పాటు సమస్యలుంటే పరిష్కరించడం, సమర్థంగా ప్రచార నిర్వహణ వంటి వాటిపై దిశా నిర్దేశం చేస్తారు.సమావేశాలకు పిలిచే నాయకుల పేర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు సీఎం ఆదేశించారు.నియోజకవర్గ స్థాయి ప్రచార, సమన్వయ బాధ్యతలను తమ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు తెరాస అప్పగించనుంది.
ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ఆదేశించారు.మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి 20 నుంచి 30 మంది సూక్ష్మ పరిశీలకులను పార్టీ అధిష్ఠానం రంగంలోకి దించుతోంది. గ్రామాల్లో గడప గడపకూ వెళ్లి స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయటమే వీరి పని.టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు.అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లనూ సూక్ష్మ పరిశీలకులు గుర్తించి, ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి నివేదికలు చేరవేస్తారు.తొలుత పార్టీ అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సూక్ష్మ పరిశీలకులను పంపించాలని నిర్ణయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-new-strategy-for-election-campaign-39-83876.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.