ఎన్నికల తాయిలాలు పెంచేసిన కేసీఆర్! దళితుల ఓట్ల కోసం కొత్త వ్యూహాలు

Publish Date:Nov 24, 2023

Advertisement

దళితబంధు  వంటి సంక్షేమ పథకాలు తమ పార్టీని తెలంగాణలో ముచ్చటగా మూడో సారి గెలిపిస్తాయన్న నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా రిజర్వుడు స్థానాలలో పాగా వేయగలిగితే మరో సారి అధికార అందలాన్ని అందుకోవడం ఏమంత కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే దళిత బంధు విషయంలో ఆయన తన హామీ రేంజ్ ను పెంచేశారు. ఇప్పటి వరకూ  విడతల వారీగా నియోజకవర్గానికి వంద మందికి చొప్పును అందిస్తున్న  సంగతి తెలిసిందే.

మరో సారి అధికారాన్ని అందుకోవడానికి దళిత బంధునే గట్టిగా నమ్ముకున్న కేసీఆర్  మరో సారి అధికారం అప్పగిస్తే ఈ పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తింప చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వంపై దళితులు వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతోనే.. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో దళితులందరికీ వర్తింప చేస్తానన్న హామీతో వారి అభిమానాన్ని తిరిగి పొందాలన్న వ్యూహంతోనే ఈ హామీ ఇచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  ఏది ఏమైనా దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ అందేలా కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తొలి విడతలో  నియోజకవర్గానికి వంద మందికి అనీ, రెండు విడతలో నియోజకవర్గానికి 11 వందల మందికీ అని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రెండు విడత హామీని బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదు.  పథకం అమలుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది.  దీంతో దళితులు  కేసీఆర్ హామీ ఇచ్చి తరువాత దానిని విస్మరించడం అలవాటుగా మార్చుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు హామీలను ఆయన పబ్బం గడిచిన తరువాత ఏలా వదిలేశారో గుర్తు చేసుకుంటున్నారు.

 ఈ నేపథ్యంలోనే దళితుల ఆగ్రహాన్ని చల్లార్చి వారిని బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకే  రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు అంటూ కొత్త నినాదాన్ని బయటకు తీశారని అంటున్నారు.  దీంతో ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకు వస్తారా? అని కేటీఆర్ పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే   కేసీఆర్ ఎన్నికల ముంగిట చేసిన ఈ వాగ్దానాన్ని వారు విశ్వసించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కలిపి 31 ఉండగా వాటిలో  మూడు మినహా మిగిలిన నియోజకవర్గాలలో ఉన్న సిట్టింగులంతా బీఆర్ఎస్ ఎమ్యెల్యేలే.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మూడూ కూడా ఖమ్మం జిల్లాలోనే ఉండటం గమనార్హం. అయితే  సిట్టింగులు ఉన్న 28 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి. ఇక గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఖాతాలో పడని మధిర, ములుగు, భద్రాచలం నియోజకవర్గాలలో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఆ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటూ హామీ ఇస్తున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో పాగా కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, పన్నుతున్న వ్యూహాలు, ఇస్తున్న వాగ్దానాలు ఏమేరకు ఫలిస్తాయన్నది ఫలితాల తరువాతే తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.