ఉండవల్లితో భేటీ అందుకేనా..? పొలిటికల్ సర్కిల్స్’లో హాట్ డిస్కషన్

Publish Date:Jun 14, 2022

Advertisement

ఉండవల్లి సరే... ఆయనకు రాజకీయంగా ఉన్నదీ లేదు, పొయేదీ లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి నందుకు 2014లోనే కాంగ్రెస్  ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అ తర్వాత ఆయన కూడా రాజకీయాలకు దూరంగా, చేసేది లేకనే కావచ్చును,  ప్రవచనాలతో కాలక్షేపం చేస్తున్నారు. సో .. ఇప్పడు ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్లేట్ ఫిరాయించినా, కేసీఆర్’ను పొగడ్తలతో ముంచెత్తినా, కేసీఆర్ భజన చేసినా ఇంకో మెట్టు కిందకు దిగి, కేసీఆర్ పెట్టే పార్టీకి సలహాదారు గానో, లేదా మరో పాత్రో పోషించినా ఆయనకు పోయేదేమీ లేదు. ఆఫ్కోర్స్, రాజమహేంద్రవరం ఎంపీగా ఆయన సంపాదించుకున్న గత వైభవం కారణంగా మిగిలున్న పరువులాంటిది ఏదైనా అంతో ఇంతో ఇంకా మిగిలుంటే, అది కాస్తా, ఖర్చయిపోతే పోవచ్చును. అంతకు మించి ఆయనకు పోయేది లేదు. వచ్చేది అయితే అసలే లేదు. 

కానీ, కేసీఆర్ పరిస్థితి, అది కాదు... ఆయన క్రియాశీల రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను సక్సెస్ఫుల్’గా ఎస్టాబ్లిష్ చేసిన ఆయన,ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. కారణాలు ఇంకైమైనా కావచ్చును కానీ, జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేసేందుకు, వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ను ఆశ్రయించిన కేసీఆర్, ఇప్పుడు ఉండవల్లితో మంతానాలు సాగించారు. కేసీఆర్ ప్రవచిస్తున్న జాతీయ జాతీయ పార్టీ ఏర్పాటుకు, ఈ భేటీకి ఏదైనా సంబంధం ఉన్నా  లేకున్నా రాష్ట్ర రాజకీయాలపై మాత్రం ఈ భేటి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే, ఆయన ఆశలు, అవసరాలు ఎలా ఉన్నా, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా, తిప్పక పోయినా, ఆయన పునాదులు మాత్రం తెలంగాణలో మరీ మాట్లాడితే, తెలంగాణ అస్తిత్వ వాదంలోనే ఉన్నాయన్నది నిజం. అవును, తెలంగాణ సెంటిమెంటే ఆయన బలం. ఆ సెంటిమెంటే ఆయన్ని ఈ స్థితికి చేర్చింది.

అయితే, ఇప్పుడు  కరుడు కట్టిన సమైక్యవాదిగా ముద్రవేసుకుని,  పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లునే న్యాయ స్థానంలో సవాలుచేసి, ఇంకా న్యాయపోరాటం చేస్తున్న, తెలంగాణ వ్యతిరేకి ఉండవల్లి అరుణ కుమార్’తో మంతనాలు జరపడం, అనేక సందేహాలకు తావిస్తోంది. చావు నోట్లో తలపెట్టి తెచ్చానని చెప్పుకునే తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు పోయి పోయి కరడు కట్టిన సమోక్యవాది ఉండవల్లితో రాజకీయ మంతనాలు సాగించడం ఏమిటి? తెలంగాణ ప్రజలు ఈ ‘భేటీని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి ఈ భేటీ ద్వారా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు ఏమి సమాధానం చెపుతారు?  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. 

తెలంగాణ సెంటిమెంట్’ను అడ్డుపెట్టుకునే తెరాస  ఒకటికి రెండు సార్లు ఎన్నికలలో  విజయం సాధించింది. అయితే ముచ్చటగా  మూడవ సారి మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టేందుకు, తెలంగాణ సెంటిమెంటును మాత్రమే నమ్ముకుంటే ప్రయోజనం ఉండదని, సెంటిమెంటును నమ్ముకుంటే ఈసారి విజయం సాధించడం అయ్యే పనికాదని కేసీఅర్’కు అర్థమై పోయిందని అంటున్నారు. ముఖ్యంగా, దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రమాద ఘంటికలు వినిపించిన నేపధ్యంలో, కేసీఆర్, జాతీయ రాజకీయాల పేరిట దక్షిణాది సెంటిమెంట్ ‘ను ఆశ్రయించారని, అందులో భాగంగానే, ఆయన ఎన్నికల వ్యూహకర్త పీకే డైరెక్షన్’లో పావులు కదుపుతున్నారని, అంటున్నారు. ఇందులో భాగంగానే, ఉండవల్లితో కేసీఆర్ భేటీ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు, ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు,  ఉద్యమ సంఘాలే కాదు, తెరాస నాయకులు కార్యకర్తలు కూడా  ఈ పరిణామాన్ని జేర్ణించుకోలేకుండా ఉన్నారని అంటున్నారు. 

ఇప్పటికే తెలంగాణ ఉద్యమా స్పూర్తిని, లక్ష్యాలను, ఉద్యమం కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 మంది అమరవీరుల త్యాగాలను మరిచి,  ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, కుటుంబ పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసీఆర్, ఇప్పుడు ఏకంగా, సమైక్య వాదానికి చెరగని చిరునామాగా నిలిచిన ఉండవల్లితో రహస్య మంతానాలు సాగించడం ఎవరి వరకో ఎందుకు, తెరాసలోనే ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్’లో ప్రధాని మోడీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏదో అన్నారని, ప్రధానిపై   ఇంతెత్తున ఎగిరిపడిన తెరాస నాయకులు, ప్రధాని మోడీ తెలంగాణను ఏపీలో విలీనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేసిన నాయకులు, ఇప్పుడు, కేసీఆరే అలాంటి సంకేతాలు పంపుతున్నారా? పునః విలీనానికి సిద్దమవుతున్నారా ? అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు.

అయితే, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం, కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారని సీనియర్ జర్నలిస్టు ఒకరు స్వీయ అనుభవం వ్యక్తపరిచారు.ఆలాగే , కొద్ది రోజుల క్రితం సినిమా నటుడు ప్రకాష్ రాజ్’ను ఇలాగే, కొద్దిరోజులు వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టారని, ఇప్పడు ఉండవల్లిని కూడా కరివేపాకులా తీసేసిన ఆశ్చర్య పోనవసరం లేదనీ అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.