కేసీఆర్ మ‌ళ్లీ ముంద‌స్తు స్కెచ్‌?.. అందుకే అలా..?

Publish Date:Feb 15, 2022

Advertisement

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని ఇప్ప‌టికే ప‌లు మీడియా సమావేశాలలో చెప్పారు. షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అంతకు ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని అన్నారు. అదే క్రమంలో ఎన్నికల ముందు, ముందస్తుకు మించిన ‘చమత్కారం’ ఉంటుందనీ ప్రకటించారు. అయితే అయన మనసులో ఏముందో.. బహుశా ఆయనకు కూడా తెలిసి ఉండక పోవచ్చును. కానీ, ఆయన ఏ మాట మాట్లాడిన, ఏ ప్రకటన చేసినా, అది సంచలనమే అవుతుంది. ఒక విధంగా ఆయన రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేస్తారు, ఇతర పార్టీల నాయకులు ‘రిలీజియస్’ గా దాన్ని ఫాలో అయిపోతుంటారు. 

అదలా ఉంటే, కేసీఆర్ కాదన్నా, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా తెరాస వర్గాల్లో  ముందస్తు చర్చ మహా జోరుగా సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ముందస్తుకు వెళితే ఉభయ తారకంగా మంచిదనే ఆలోచన చేస్తున్నారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వరుస మీడియా సమావేశాలు, బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక మర్మం అదే అనే అనుమానం టీఆర్‌ఎస్‌ వర్గాలలో వినవస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దూకుడు పెంచినా.. కాంగ్రెస్‌తో సంబంధం లేదంటూనే ఆ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీకి అనూహ్యంగా మద్దతు పలికినా ఇవ్వన్నీ.. ముందస్తు  రాజకీయ వ్యూహంలో భాగమేనని పార్టీ  వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలు అదీ ఇదీ అంటున్నా సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ ఎన్నికల క్రతువు కానిచ్చి, బయట పడే ఆలోచన‌లో ఉన్నారని అంటున్నారు. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యూహరచన సాగుతోందని పార్టీ నేతలు చెపుతున్నారు. 

పట్టుమని పది మంది ఎంపీలు లేకుండా జాతీయ రాజకీయాల్లో, అది కూడా ఉత్తర భారత రాజకీయ సమీకరణలను ఎదుర్కుని కేంద్రంలో చక్రం తిప్పడం అయ్యే పని కాదని కేసీఆర్’కు తెలుసు. అయితే రాష్టంలో అధికాన్ని నిలుపుకోవాలంటే, టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌స-బీజేపీ మధ్య ముక్కోణ పోటీ అవసరం. అందుకే, బీజేపీని బరిలో దించేందుకు కేంద్రం పైనా, బీజేపే పైన కత్తులు దూస్తున్నారు. కానీ, తెరాసకు ప్రధాన ముప్పు కాంగ్రెస్ పార్టీనే అనే విషయం ఆయనకు తెలుసు. అదుకే కాంగ్రెస్ తక్కువ చేసి చూపేందుకే,  కేసీఆర్ జాతీయ రాజకీయ రచ్చ తెరమీదకు తెచ్చారని  పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడకుండా చూడటం కేసీఆర్‌ లక్ష్యాల్లో ముఖ్యమైనవిగా కనిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఎన్నికలకు వెళితే మంచిదని కేసేఅర్ భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్తులను బట్టి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసేఅర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అదే జరిగితే,  ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని, ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలంటే, కర్ణాటక అసెంబ్లీతోపాటు, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని టీఆర్‌ఎస్‌ వర్గాలు కోరుకుంటున్నాయని అంటున్నారు.
 
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం 2024, జనవరి 16న ముగుస్తుంది. అంతకంటే ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఈసీ ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీతోపాటు ఇక్కడా ఎన్నికలు రావాలంటే ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో ఇక్కడ అసెంబ్లీని రద్దు చేయాలి. ఏడాది పదవీకాలాన్ని వదులుకోవాలి. అప్పుడే ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీని నివారించగలుగుతాం’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు.అయితే , కేసీఆర్ ... ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే ఉంటుందని, పార్టీ వర్గాలు అంటున్నాయి. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్’ హుజూరాబాద్ బెదురూ నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మచిందని పార్టీలో అయన తర్వాత ఆయనంతటి కీలక నేత ఒకరు పార్టీ  నాయకులతో అన్నట్లు సమాచారం.

By
en-us Political News

  
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.