కాళ్లు మొక్కినా ఫలితం లేకపోయే.. హెల్త డైరెక్టర్ కు కేసీఆర్ రిక్తహస్తం!

Publish Date:Aug 25, 2023

Advertisement

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఒక అధికారిగా ఆయన ప్రతిభ, పని తీరు సంగతి ఏమో కానీ.. రాజకీయ ఆశావహుడిగా మాత్రం ఆయన రాష్ట్రంలో సుపరిచితుడు. కొత్తగూడెం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు.. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా తన హోదాను, పరపతిని కేసీఆర్ కాళ్ల దగ్గర పడేశారు. పలుమార్లు ఆయన కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. పలుమార్లు రాజకీయ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన ఇవన్నీ తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికే చేశారనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు.

అధికారిగా తన పరిధులు మీరి మరీ ఆయన చేసిన విన్యాసాలు చివరికి ఆయన ఆశించిన ఫలితాన్ని ఇచ్చాయా? ఆయన కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న కోరికకు కేసీఆర్ ఆమోదముద్ర వేశారా అంటే అదేం జరగలేదు. పాపం శ్రీనివాస్ కేసీఆర్ లైట్ గా తీసుకున్నారు. 
ఇంతోటి దానికి ఆయన అధికారిగా పలుచన అయ్యారు. తన స్థాయిని మరిచి కాళ్లు మొక్కారు. భట్రాజును తలదన్నేలా నేతలను పొగడ్తలలో ముంచెత్తి నవ్వుల పాలయ్యారు. సరే అసలు విషయానికి వస్తే..

వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్   నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటూ వచ్చారు.  ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయన్న వివాదాస్పద వ్యాఖ్యల నుంచి..  పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కడం వరకూ ఆయన ఏం చేసినా కొత్తగూడెం అసెంబ్లీ  టికెట్ కోసమేనని అప్పట్లోనే పరిశీలకులు పలు ఉదాహరణలతో విశ్లేషణలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని తనను తాను మరచి మరీ పొగడ్తల వర్షం కురిపించేశారు.  హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసినా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.  ఆయన  ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో నెటిజన్లు ఏకి పారేశారు.  

 గడల శ్రీనివాసరావు  కరోనా సమయంలో కరోనా కేసులు, చికిత్స పొందుతున్నవారు, మరణించినవారు.. ఇలా నిత్యం లెక్కలు చెప్పడానికి   మీడియా ముందుకొచ్చేవారు. ఆయన లెక్కలన్నీ  తప్పులతడకని పలుమార్లు హైకోర్టు చేత తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆయనా చీవాట్లు తిన్నారు.  కరోనా లెక్కలతో మీడియాలో పాపులరైన (అప్రతిష్ట పాలైన) గడల శ్రీనివాసరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారు. మీడియాలో పాపులర్‌ కావడం ద్వారా  రాజకీయాలలో రాణించాలని తహతహలాడారు. అంతేనా  తరచూ  కొత్తగూడెంలో పర్యటించడం, ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించడం, పర్యవేక్షించడంతో ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించారు. కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది కూడా తానేనంటూ పలుమార్లు  ప్రకటనలు సైతం చేశారు.  ప్రచారం కూడా చేసుకున్నారు.  కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడి వ్యవహారంలో వివాదాస్పదం కావడం, ఎన్నికల సమయంలో వేసిన అఫడివిట్‌ లో తప్పుల కారణంగా తెలంగాణ హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించడం వంటి కారణాలతో కొత్తగూడెం అభ్యర్థిని తానేనని గడల శ్రీనివాసరావు ఫిక్సైపోయారు.  వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు కూడా సంధించారు. ఇదే సమయంలో కేసీఆర్‌ పై ప్రశంసలు కురిపించేశారు.  కట్ చేస్తే.. ఆశల పల్లకీలో ఊరేగిన ఆయన  కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన  తర్వాత బొక్కబోర్లా పడ్డారు. ఆ జాబితాలో శ్రీనివాసరావు పేరు లేదు.   మళ్లీ బీఆర్‌ఎస్‌ టికెట్‌ నున వనమా వెంకటేశ్వరరావుకే కట్టబెట్టారు. దీంతో తానే అభ్యర్థినని చెప్పుకుంటూ వచ్చిన గడల  కంగు తిన్నారు.   మీడియాకే కాదు.. ఎవరికీ ముఖం చూపకుండా సైలెంటైపోయారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.