గజ్వేల్ కు కేసీఆర్ గుడ్ బై

Publish Date:Jun 7, 2022

Advertisement

రెండుసార్లు ఘన విజయం కట్టబెట్టిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టాటా.. బైబై చెప్పేస్తున్నారట. ఈ విషయం టీఆర్ఎస్ వర్గాలే  చెబుతున్నాయి.  మెదక్ లోక్ సభ స్థానం నుంచి  లేదా.. మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ శాసనసభకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు 86 వేల 694 ఓట్లు వేసి, సమీప టీడీపీ ప్రత్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కన్నా 19 వేల 391 ఓట్లు ఆధిక్యం కట్టబెట్టారు గజ్వేల్ నియోజకవర్గం ఓటర్లు. మరి 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు లక్షా 25 వేల 444 ఓట్లు వేయడంతో పాటు కాంగ్రెస్ తరఫున కేసీఆర్ కు సవాల్ చేసిన అదే ప్రత్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కన్నా 58 వేల 290 ఓట్ల మెజార్టి ఇచ్చారు జనం. మరి తనను ఇంతలా జనం ఆదరిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు కేసీఆర్ ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీపై ఓటర్లలో సహజంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా   చెబుతుండడంతో ఆయన వ్యూహం మారుస్తున్నారంటున్నారు. గత ఎన్నికల కన్నా ఈ సారి టీఆర్ఎస్ కు సీట్లు, ఓట్ల శాతం కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే  గజ్వేల్ ఓటర్లు కూడా కేసీఆర్ ను నెత్తిన పెట్టుకునేందుకు సిద్ధంగా లేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆరే తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పుడు తామంతా అభివృద్ధిలో దూసుకుపోతామని ఓటర్లు సహజంగా ఆశించారు. అయితే.. కేసీఆర్ ఎంతసేపూ తన ఫాంహౌస్ అభివృద్ధిపైనే కాని నియోజకవర్గం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి.

మరో పక్కన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి గతంలో ఓడిపోయిన వంటేరు ప్రతాపరెడ్డి నియోజకవర్గంలో బలమైన రాజకీయ నాయకుడు. గతంలో కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై వంటేరు చేయని ఆరోపణ లేదు. 2018 ఎన్నికల తర్వాత వంటేరు ప్రతాపరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ టికెట్ వంటేరుకు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని అంటారు. అందు కోసం కూడా ఈ సారి గజ్వేల్ పోటీ నుంచి కేసీఆర్ తప్పుకుంటున్నారంటున్నారు. ఈ సారి గజ్వేల్ నుంచి పోటీ చేయబోనని, వంటేరు ప్రతాప్రెడ్డి రెడీగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు ఆయన వర్గీయులు చెబుతుండడం గమనార్హం.

గజ్వేల్ నుంచి కాకుండా ఈ సారి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరిగింది.  అయితే.. అది కూడా కాదని కేసీఆర్ ఈ సారి మెదక్ నుంచి లోక్ సభ  స్థానం నుంచి బరిలో దిగుతారనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.  అందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమిని కూడగట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేస్తే.. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా చక్రం తిప్పాలనే తన లక్ష్యం కష్టం అవుతుందనేది కేసీఆర్ అభిప్రాయంగా ఉందంటున్నారు.  అందుకే ఈ సారి కూడా మెదక్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్ సభా నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పోటీ చేసి విజయాలు సాధించారు. అయితే.. కొత్త రాష్ట్రం తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు.

ఇప్పుడు కేసీఆర్ అటు గజ్వేల్ నుంచి, ఇటు మెదక్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయకపోయినా తెలంగాణలోని మరే ఇతర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తే.. గజ్వేల్ లో వంటేరుకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. మెదక్ లో కేసీఆర్ పోటీ చేయకపోతే.. మరొకరిని ఛాన్స్ వస్తుంది. అలాంటి అవకాశమే వస్తే.. మెదక్ సీటు కోసం పలువురు నేతలు క్యూలో ఉన్నారంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేయడం, వాటికి ఆయా నాయకులే నాయకత్వం వహిస్తుండడం విశేషం.

ఒక పక్కన తమ ప్రభుత్వంపై జనం నుంచి వ్యక్తం అవుతున్న వ్యతిరేకత, మరో పక్కన పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా కేసీఆర్ లో ఆందోళన మొదలైందని అంటున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ఎలాంటి వ్యూహం రచిస్తారో అని రాజకీయ వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోను, తెలంగాణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.