ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్.. కిషన్ రెడ్డి

Publish Date:Oct 28, 2022

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మునుగోడు ఓటమి కళ్లెదుట కనిపిస్తుండటంతో దిక్కుతోచక కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడితే శిక్షనుంచి తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ కు ఆయన కుటుంబానికి అర్ధమైందని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ అల్లిన కథలో దొరికిన డబ్బు కేసీఆర్ ఫాం హౌస్ నుంచి వచ్చిందా? ప్రగతి భవన్ నుంచి వచ్చిందా ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన నందకుమార్ తనకు సన్నిహితుండంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రిగా తాను పలు కార్యక్రమాలలో పాల్గొంటాననీ, ఆయా సందర్భాలలో ఎవరెవరో తనతో ఫొటోలు దిగుతుంటారని అన్న కిషన్ రెడ్డి.. నందకుమార్ తనతోనే కాదు.. జోగినపల్లి సంతోష్, హరీష్ రావులతో సహా పలువురితో నందకుమార్ ఫోలోటు ఉన్నాయనీ.. వారందరికీ కూడా నందకుమార్ 
సన్నిహితుడేనా అని ప్రశ్నించారు.

ఇక ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేసీఆర్ ను మించిన ఘనుడు లేడని కిషన్ రెడ్డి అన్నారు. స్వయంగా కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడే టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అన్నిటికీ మించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు  మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్ ఆని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఏ పార్టీ టికెట్ పై గెలిచి ఏ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారో ఇంద్రకిరణ్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్లు ఇచ్చి కొనాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. అయినా అన్నేసి కోట్లు పోయడానికి బీజేపీకి స్తోమత లేదన్న కిషన్ రెడ్డి.. తమ పార్టీ సొంత విమానాలు కొనేంత ధనిక పార్టీ కాదన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో పోలీసుల తీరు కూడా దారుణంగా ఉందన్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో తమ పార్టీ అభ్యర్థి రఘునందనరావు నివాసంలో పోలీసులే డబ్బు పెట్టిన సంగతి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందనీ, నవంబర్ 6న కేసీఆర్ కు దిమ్మ తిరగడం తథ్యమని అన్నారు.   

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.