గజ్వేల్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కెసీఆర్ 

Publish Date:Aug 9, 2023

Advertisement

ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గానికి అరుదైన రికార్డు ఉంది.  ఆ సంప్రదాయం తెలంగాణా రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత కూడా కొనసాగుతోంది.

ఉమ్మడి రాష్ట్రం ఆవిర్బవించిన   తర్వాత నుంచే గజ్వేల్ నియోజకవర్గానికి పెద్ద సెంటిమెంటే ఉంది.
అయితే గ‌జ్వేల్ చ‌రిత్ర పరిశీలిస్తే మాత్రం…సీఎం సీటుకు…గజ్వేల్‌లో గెలుపుకు మాత్రం పెద్ద లింక్ ఉంది అనే చెప్పాలి. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కేసీఆర్ 2014,2018 ఎన్నికల్లో
 ఇక్క‌డి నుంచి పోటీ చేశార‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ సెంటిమెంట్‌ను ఈ సారి కూడా ఆయ‌న ఫాలో అయ్యే అవ‌కాశం మాత్రం క‌నిపిస్తోంది. గ‌జ్వేల్‌లో గెలిచిన పార్టీయే అధికారంలోకి వ‌స్తుంది. ఇది ఈ నియోజ‌క‌వ‌ర్గం పుట్టినప్ప‌టి నుంచి ఉన్న సెంటిమెంట్‌. ఇప్ప‌టివ‌ర‌కూ అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ అయింది లేదు. 
 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత తొలి సారి గజ్వేల్ నియోజకవర్గం పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండెం వాసుదేవు పోటీచేసి గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగలిగింది.1957లో జెబి ముత్యాలరావు గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 

1972, 1978 ఎన్నిక‌లలో గ‌జ్వేల్ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటు నుంచి కాంగ్రెస్   అభ్య‌ర్థి గ‌జ్వేల్ సైద‌య్య గెలిచారు.   అప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆత‌ర్వాత 1983లో టిడిపి అభ్యర్థి అల్లం సైదులు విజ‌యం సాధించారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. 
1989లోఢాక్టర్  జె. గీతారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 
1994 ఎన్నికల్లో విజయరామారావ్,,1999 ఎన్నికల్లో బి. సంజీవరావు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందడంతో టీడీపీ అధికారంలో రాగలిగింది. 
1989లో కాంగ్రెస్ తరపున డాక్టర్ జె. గీతారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసింది. 1994 ఎన్నికల్లో జి. విజయరామారావు, 1999 ఎన్నికల్లో బి. సంజీవ రావు టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందడంతో మళ్లీ టీడీపీ అధికారంలో వచ్చింది.
2004లో డాక్టర్ జె. గీతారెడ్డి రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 2009లో జి.నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి కూడా మళ్లీ కాంగ్రెస్ అధికారంలో వచ్చింది.

 వచ్చే ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టడానికి కెసీఆర్ యత్నిస్తున్నారు. 2014,2018 ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకున్న  కెసీఆర్ మూడో సారి హ్యట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. 2014,2018లో కెసీఆర్ మీద వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.  కాంగ్రెస్ వేవ్ లో గజ్వేల్ సెంటిమెంట్  వర్కవుట్ అవుతుందని కెసీఆర్ భావిస్తున్నారని, అందుకు తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.