Publish Date:Apr 26, 2022
కొన్ని రోజులుగా ఒకటే హడావుడి. పీకే కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం. ఇక హస్తానికి మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఊహాగానాలు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారనే వాదన. మరి, కేసీఆర్ పరిస్థితి ఏంటంటూ విశ్లేషణ. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారంటూ బ్రేకింగ్ న్యూస్. నాలుగు రోజుల పాటు ధూంధాంగా నడిచింది ప్రశాంత్ కిశోర్ ఎపిసోడ్. అంత రాగం తీసి.. తాజాగా తుస్సుమనిపించారు ఆ ఐప్యాక్ ఓనర్. కాంగ్రెస్‌లో చేరేది లేదంటూ.. కావాలంటే తన సేవలు కొనుక్కోవచ్చంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనకంటే.. నాయకత్వం, ఐక్యత, ప్రక్షాళన.. హస్తం పార్టీని గెలిపిస్తుందంటూ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. పీకే కాంగ్రెస్‌లో చేరడం లేదనే వార్త విని.. కొందరు హమ్మయ్య అని కూడా ఊపిరిపీల్చుకునే ఉంటారు.
అదేంటి, పీకే ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అనే అనుమానం రాకమానదు. అడక్కుండానే.. పలు సర్వేలు చేసి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితిని విశ్లేషించి.. గెలవాలంటే ఏమేం చేయాలో ఆలోచించి.. సోనియాను కలిసి.. కాంగ్రెస్ పెద్దలకు వాస్తవం అర్థమయ్యేలా ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు. ఆ ప్రదర్శనకు ముగ్థులైన 10 జన్‌పథ్.. పీకే సలహాలు, సూచనల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కమిటీ కూడా నియమించి చర్చించింది. పీకే తాను కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పినా.. ఐప్యాక్ సేవలు మరోపార్టీకి అందించనంటేనే చేర్చుకోవాలంటూ సో కాల్డ్ సీనియర్స్ ఆయన చేరికకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు. రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనగా.. లేటెస్ట్‌గా హస్తానికి హ్యాండ్ ఇస్తున్నట్టు పీకే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రశాంత్ కిశోర్‌లో ఈ మార్పుకు కారణం ఎవరు? అంటే.. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు.
అవును, పీకే ఢిల్లీ కాంగ్రెస్‌కు ప్రజెంటేషన్ ఇచ్చాక.. ఆ వెంటనే హైదరాబాద్ వచ్చి.. రెండు రోజుల పాటు ప్రగతిభవన్‌లో మకాం వేసి.. సీఎం కేసీఆర్‌తో మారథాన్ మంతనాలు జరిపారు. అంత ముఖ్యమైన చర్చలు ఏం చేశారో అంటూ అంతా ఆసక్తి కనబరిచారు. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసేలా గులాబీ బాస్‌ను పీకే ఒప్పిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, లోపల జరిగింది వేరని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. "అరే పీకే.. నువ్ రాజకీయాల్లో బచ్చేగాడివి.. నేను నీకంటే సీనియర్. ప్రస్తుతం మోదీని కొట్టే మొనగాడు లేడు. ఆ ముసలి కాంగ్రెస్‌తో కలిస్తే.. నీకు లాభం లేదు. నా మాట విను. కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్ర మాత్రమే. ఆ పార్టీని నీతో సహా ఎవడూ పైకి లేపలేడు. హస్తం పని ఖతం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీవెంట నేనున్నా. కాంగ్రెస్ వద్దు. ప్రాంతీయ పార్టీలే ముద్దు. రీజినల్ పార్టీలకు ఐప్యాక్ సేవలు అమ్ముకో. బాగా డబ్బు సంపాదించుకో. అనవసరంగా హస్తాన్ని నమ్ముకొని ఆగమాగం కాకు".. అంటూ ప్రశాంత్ కిశోర్‌కే కేసీఆర్ హితోపదేశం చేశారని అంటున్నారు. కేసీఆర్‌తో రెండు రోజుల పాటు బ్రెయిన్ వాష్ చేయించుకున్న పీకే.. ఢిల్లీ వెళ్లి.. కూల్‌గా ఆలోచించి.. కాంగ్రెస్‌లో చేరనంటూ ప్రకటించేసి.. కేసీఆర్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారని సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-effect-on-pk-25-135027.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.