కెసీఆర్ కు న్యాయ వ్యవస్థ అంటే లెక్కే లేదు .... అందుకే జస్టిస్ నరసింహారెడ్డిపై ఫైర్
Publish Date:Jun 18, 2024
Advertisement
రాజులు పోయారు రాచరికాలు పోయాయి. కానీ బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ ఇంకా రాజరిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాడు. కెసీఆర్ హాయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తే రాజరిక వాసనలున్న కెసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇక్కడితో ఆగలేదు విచారణ కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డికి ఓ లేఖ రాసి తన అక్కసును వెళ్లగక్కారు. జస్టిస్ నర్సింహారెడ్డికి ఏం తెలియదు పొమ్మన్నాడు. విద్యుత్ కొనుగోళ్లపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చీఫ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు. పవర్ కమిషన్‌కు కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖపై విచారణ మొదలుపెట్టిన జస్టిస్ నరసింహా రెడ్డి కెసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలించారు
లీగల్ అంశాలను సైతం లీగల్ టీమ్ పరిశీలించాలని పవర్ కమిషన్ చీప్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఇచ్చిన వివరణలో సంతృప్తి చెందకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. జూన్ 15 వ తేదీలోపు కెసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని గడువు విధించారు. అయితే సమయం సరిపోదని కెసీఆర్ కమిషన్ కు మరో లేఖ రాశారు. జూన్ 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలి అని కెసీఆర్ కోరినప్పటికీ పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి గడువు పొడగించడం లేదు. కెసీఆర్ జూన్ 15 వ తేదీలోపు కమిషన్ ఎదుట హాజరు అవుతారని తెలుస్తోంది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నాలుగు మూలస్థంభాల్లో జ్యుడిషియరీ ఒక మూల స్థంభం. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కెసీఆర్ కు జ్యుడిషియరీ మీద పెద్దగా గౌరవం లేదు. రెండు దశాబ్దాల నుండి కోర్టు వివాదాల్లో జర్నలిస్టుల భూమి నలుగుతోంది. సుప్రీం తీర్పు తర్వాత ఈ భూముల అప్పగించకుండా కెసీఆర్ ఒక నియంతలా వ్యవహరించాడు . బిఆర్ఎస్ హాయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రమణ తుది తీర్పును కెసీఆర్ పూర్తిగా తొక్కిపెట్టాడు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హాయంలో మార్కెట్ రేటు ప్రకారం ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూమిని జవహార్ హౌజింగ్ సొసైటీ కోర్టు వివాదాల కారణంగా జర్నలిస్ట్ లకు అప్పగించలేకపోయింది. కెసీఆర్ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ఎండగట్టింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇస్తూ సుప్రీం తుది తీర్పును అమలు చేస్తామని వాగ్దానం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే వెనువెంటనే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోర్టు తీర్పును అమలు చేయలేకపోయినట్లు రేవంత్ సర్కార్ చెబుతోంది. ఎన్నికల కోడ్ ముగియడంతో రెండు దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న జర్నలిస్ట్ లకు మంచి రోజులు వచ్చాయని ఇటీవల సొసైటీ డైరెక్టర్లుగా ఎంపికైన రమణారావ్, అశోక్ రెడ్డిలు తెలిపారు. జవహార్ హౌజింగ్ సొసైటీకి పదేళ్లుగా ఎన్నికలు జరగకుండా కెసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ సభ్యులైన రమణారావ్, అశో్క్ రెడ్డి టీం జెఎన్ జె తరపున పోరాడి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగడానికి దోహదపడ్డారు.
http://www.teluguone.com/news/content/kcr-does-not-care-about-justice-systemthats-why-justice-narasimha-reddy-is-under-fire-25-178923.html





