కేసీఆర్‌ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. చంద్ర‌బాబే దిక్కా!

Publish Date:Mar 11, 2024

Advertisement

ఒక‌ప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ బీఆర్ ఎస్ అధినేత,  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు.. అయితే ఆ కేసు ఇప్పుడు కేసీఆర్‌ మెడ‌కు చుట్టుకోబోతోందా?  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా?  అప్ప‌ట్లో చంద్ర‌బాబును దేవుడు కూడా కాపాడ‌లేడ‌ని చెప్పి కేసీఆర్‌కు.. ఇప్పుడు చంద్ర‌బాబు దేవుడు కాబోతున్నాడా?  అంటే అవున‌నే చ‌ర్చ తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది.  ఈ చ‌ర్చ‌కు ప్ర‌ధాన కార‌ణం  ప్ర‌ణీత్ రావు వ్య‌వ‌హారం. బీఆర్ ఎస్ హ‌యాంలో స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్ర‌ణీత్ రావు ఆధ్వ‌ర్యంలో ప‌లు పార్టీల నేత‌లు, ఇత‌రుల ఫోన్లు ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ణీత్ రావును స‌స్సెండ్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైంది.  ప్ర‌స్తుతం ప్ర‌ణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ  విచార‌ణ‌లో ప్రణీత్ రావు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ణీత్ పూర్తి స్థాయిలో గుట్టువిప్పితే మాజీ సీఎం కేసీఆర్ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు గ‌ట్టిగానే చుట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌డానికి రాజ‌కీయాల్లో పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. ఆ ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డం  రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.  అయితే  ఎప్ప‌టిలాగే కొన్నిరోజులు ఈ అంశంపై హ‌డావుడి ఉంటుంది. ఆ తరువాత ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం మ‌ర్చిపోతుంద‌ని కొంద‌రు భావించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్య‌వ‌హారాన్ని తేలిగ్గా తీసుకొనే ప‌రిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ త‌న హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల క‌ద‌లిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేవార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రేవంత్ సైతం ప‌లుసార్లు ఈ అంశాన్ని లేవ‌నెత్తిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. రేవంత్ సీఎం అయిన త‌రువాత.. హోంశాఖను త‌న‌వ‌ద్దే ఉంచుకోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం  పోలీస్ శాఖ‌ను సెట్‌రైట్ చేసే బాధ్య‌త‌ను తీసుకోవాలన్న నిర్ణయంతోనే అంటున్నారు. ఆ క్ర‌మంలోనే కేసీఆర్ కుటుంబానికి పోలీస్ శాఖ‌పై ఉన్న ప‌ట్టును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో.. ఆ వ‌జ్రాయుధాన్ని తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగించడానికి రేవంత్ ప‌క్కాప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. 

బీఆర్ ఎస్ హ‌యాంలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంలోనే కాదు.. బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారంలో ఫోన్ ట్యాపింగ్ కు మాజీ సీఎం కేసీఆర్ పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఫామ్ హౌస్ లో ప్రముఖ బీజేపీ నాయకులను డబ్బుతో పట్టుకొన్నామ‌ని కేసీఆర్ తెగ హంగామా చేసిన విష‌యం తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు, న్యాయమూర్తులకు లేఖ‌లు రాసి బీజేపీ తన ప్ర‌భుత్వాన్ని పడగొట్టడానికి  కుట్ర చేస్తే తాను పట్టుకొన్నామ‌ని అప్పట్లో కేసీఆర్  హ‌డావుడి చేశారు. అంతేకాదు  ప్రధాని మోడీని  నానా విధాలుగా దుర్భాష‌లాడారు. ఆ దెబ్బతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి దేశానికే ప్రధాని అవుతాన‌ని కేసీఆర్ క‌ల‌లు క‌న్నారు. కానీ, కేసీఆర్ ను దేశంలో ఎవ్వరూ నమ్మలేదు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి నాటినుంచి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి కేసీఆర్ పునాదులు క‌దిలిస్తున్నారు. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి  రావడంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేత‌లు మాత్రం తేలుకుట్టిన దొంగ‌ల్లా మౌనంగా ఉన్నారు..  రేవంత్ రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకొంటూ పోతున్నారు.

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని రేవంత్ ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్‌సీ చైర్మ‌న్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ నియామకాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మాజీ డీజీపీపై అవినీతిప‌రుడ‌నే ముద్ర వేశారు. ఆయ‌న్ను ఎలా టీఎస్‌పీఎస్‌సీకి చైర్మ‌న్ గా నియ‌మిస్తారంటూ   ప్ర‌భుత్వంపై చిందులు తొక్కారు క‌విత‌. అప్పుడు క‌విత గోల‌పెడితే అర్థం కాలేదు.  కానీ, మెల్ల‌మెల్ల‌గా అర్థ‌మ‌వుతోంది ఏమిటంటే.. మ‌హేంద‌ర్ రెడ్డి అప్రూవ‌ల్ గా మారిపోతే  త‌మ హ‌యాంలో గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిపిన వ్య‌వ‌హారాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌న్న భ‌యంతోనే క‌విత అలా మాట్లాడిన‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  బీఆర్ ఎస్ హ‌యాంలో ఒక్కో వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తుండ‌టంతో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలోనూ క‌ల‌హాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డికి మాత్ర‌మే అన్యాయం  జ‌ర‌గ‌లేదు.. బీజేపీ నేత‌లుసైతం ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో ఇబ్బందిప‌డ్డ‌ారు. దీంతో కేసీఆర్ గుట్టు  విప్పి.. జైలుకు పంపించ‌డంలో రేవంత్ రెడ్డికి కేంద్రంలోని మోడీ స‌హ‌కారం కూడా ఉంద‌ని, ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం కేసీఆర్ కు పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లు ఉంద‌ని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కేసీఆర్ విష‌యంలో రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తుందనీ, రేవంత్‌ ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న ప్ర‌చారం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో  పోరుగా సాగుతోంది.  

కేంద్రం, రాష్ట్రంలో కూడా కేసీఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశంలేక కొత్త ఎత్తుగడగా తనమీద కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ప‌గ‌తోనే దాడిచేస్తున్నాయ‌ని, తాను సత్తెపూసను అని జనాన్ని నమ్మించి   సానుభూతి పొందాలని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.  ఇందుకోసం వంద‌ల యూట్యూబ్ చాన‌ల్స్ సృష్టించి. అక్రమంగా సంపాదించిన వేలకోట్లు వెదచల్లి తప్పుడు వార్తలతో రేవంత్ రెడ్డిపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో క‌రవు వ‌చ్చిన స‌మ‌యంలో రైతులు ప‌డ్డ ఇబ్బందుల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి హ‌యాంలో రాష్ట్రంలో క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారనీ, ఆ ప్రచారంతో  లోక్ సభ  ఎన్నిక‌ల్లో  ల‌బ్ధిపొందాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  పార్ల‌మెంట్‌ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా కేసీఆర్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ గుట్టును ర‌ట్టు చేసేందుకు రేవంత్ ముందుకెళ్తే  ఆఖ‌రి అస్త్రంగా చంద్ర‌బాబును శరణు వేడేందుకు సైతం కేసీఆర్ వెనుకాడ‌ర‌ని అంటున్నారు. దీంతో గ‌తంలో చంద్ర‌బాబును ఆ దేవుడుకూడా కాపాడ‌లేడ‌న్న కేసీఆర్ కు త్వ‌ర‌లో చంద్ర‌బాబే దేవుడైనా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.