స్వోత్కర్ష.. కేంద్రంపై నింద.. రైతు సంఘాలతో కేసీఆర్ సమావేశం సారాంశమిదే!

Publish Date:Aug 28, 2022

Advertisement

కేసీఆర్ సమావేశమంటే స్కోత్కర్ష.. పరనింద మాత్రమే. సభ ఏదైనా, సమావేశం ఏదైనా, ఎవరితో భేటీ అయినా కేసీఆర్ చెప్పే ఆవుకథ ఒక్కటే. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానీ అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని సంక్షేమ కార్యక్రమాు తెలంగాణలో చేపట్టాం.. కేంద్ర ప్రభుత్వం కనీసం ఊహకు కూడా రాని అభివృద్శి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. అది భరించలేకే.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ వ్యవసాయ విధానాలు బహు భేషుగ్గా ఉన్నాయనీ, తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం బహు గొప్పగా విలసిల్లుతోందనీ దేశ వ్యాప్తంగా చాటేందుకు కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు సంఘాల ప్రతినిధులను తెలంగాణకు పిలిపించుకుని మరీ సమావేవమయ్యారు.  ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగ సారాంశమంతా ముందుగా చెప్పుకున్నట్లు ఆవు కథే. తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తోందని అహో.. ఓహో పొగుడు కోవడం వచ్చిన వారి చేత పొగిడించుకోవడం ఇందు కోసం కేసీఆర్‌కి ఎవరినైనా సరే ప్రగతి భవన్ కు ఆహ్వానిస్తారు. పిలిపించుకుంటారు.బ్రహ్మాండమైన ఆతిధ్యం ఇస్తారు.  గత మూడేళ్లుగా కమ్యూనిస్టులను అత్యంత చులకనగా మాట్లాడిన కమ్యూనిస్టుల అవసరం ఇప్పుడాయనకు కలిగింది. అందుకే వారికి ఇటీవల ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.

రాజమర్యాదలతో విందు దొరికింది. అదంతా మునుగోడు మహాత్మ్యమే అని విమర్శకులు అన్నా.. కేసీఆర్ కు వారితో అంతకు మించిన అవసరమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడిన. ఇప్పటికీ విభజనపై విమర్శలు గుప్పిస్తున్న ఉండల్లికీ,  అలాంటి చాలా మందికీ ఇటీలి కాలంలో ప్రగతి భవన్ ద్వారాలు బార్లా తెరుచుకుంటున్నాయి. అదంతా వారి గొప్పదనం కాదు. వారితో కేసీఆర్ కు అవసరం పడటమే కారణం.

అది కాస్తా తీరిపోతే... మళ్లీ వారికి ప్రగతి భవన్ దర్శనం గగనమే అవుతుంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.  తాజాగా ఉత్తరాది రైతు సంఘాల నేతలతోన కేసీఆర్‌కు అవసరం వచ్చింది. తెలంగాణలో వ్యవసాయ రంగం అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లి వీరంతా  ప్రచారం చేయాలి. అందుకే ఆహ్వానించారు. రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. తెలంగాణ రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తామని వారు భోజనం తర్వాత హామీ ఇచ్చారు. అదీ సంగతి. ఈ భేటీ వేదికగా కేసీఆర్.. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు  

రైతు సంఘాలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశంలో తీర్మానం చేసింది. కాదు కాదు చేయించారు. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మోడల్ అత్యవసరం అని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాలని అందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని రైతు నేతలు కోరారు.

ఉత్తర, దక్షిణ భారత్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా  చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళైనా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూడాల్సి రావడం దారుణం అన్నారు. దేశంలో మొత్తం 70వేల టీఎంసీల నీటి వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు కేసీఆర్. తాగునీరు, సాగునీరుకు 50వేల టీఎంసీల నీరు సరిపోతుందని.. అయినా ఇంకా వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగా రాష్ట్రం.. రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ సాగునీటిని అందిస్తున్నప్పుడు ఈ పనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్. రైతులు కూర్చుని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ లు ఉన్నాయా? అని నిలదీశారు. రైతు సంఘాల నేతలకు ప్రగతిభవన్ లోనే అల్పాహారం, లంచ్ ఏర్పాటు చేశారు. రాకేశ్ టికాయత్ ఆదివారం ప్రగతి భవన్ కు రానున్నారు. ఆదివారం కూడా రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది.  మొత్తం 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.