ఎన్నికల సంగతి తరువాత.. ముందు కవిత చిక్కులపైనే కేసీఆర్ దృష్టి

Publish Date:Feb 24, 2023

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐలు వేటికవిగా దర్యాప్తును వేగవంతం చేసిన క్రమంలో రోజు రోజుకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు చేరువ అవుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే స్వయంగా కవిత, బీఆర్ఎస్ లు కూడా అదే అభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు అయితే.. ఏం చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రులు, నేతలతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య ప్రగతి భవన్ లో అధికారిక ప్రకటనలేవీ లేకుండానే అత్యవసర సమావేశాలు జోరుగా సాగుతున్నాయనీ అంటున్నారు. ఆ సమావేశాల చర్చల సారం ఒక వేళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టయితే ఏం చేయాలి.. లీగల్ గా ఎదుర్కోవడంతో సరిపెట్టకుండా, పొలిటికల్ ఫైట్ ఏ విధంగా చేయాలి అన్న దానిపై వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. గత కొద్ది కాలంగా రాజకీయ ప్రకటనలు, విమర్శలకు దూరంగా ఉన్న కవిత ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం కూడా వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు.

కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచడం వెనుక ఒక వేళ డిల్లీ మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తే కేంద్రాన్ని విమర్శించిన కారణంగా కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందంటూ కేంద్రాన్ని తప్పుపట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు.  మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేయడం జరిగితే.. అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి... ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీయే కాకుండా కాంగ్రెస్, వైఎస్సార్టీపీ.. ఇతర పార్టీలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై షర్మిల విమర్శల కారణంగానే ఇటీవల ఆమెను రెండు సార్లు అరెస్టు చేశారంటూ వైఎస్సార్టీపీ ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తోంది.

ఇక ఇప్పుడు కవిత అరెస్టు జరిగితే.. కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తున్నందుకే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేయాలని భావించినా.. సామాన్య జనంలో నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా తేలికగా తీసుకుంటారా అన్న చర్చ కూడా ప్రగతి భవన్ లో జరుగుతున్నట్లుగా సమాచారం.  ఇక కవితను అరెస్టు చేయడమంటూ జరిగితే లీగల్‌గా ప్రొసీడ్ కావడం? అదే సమయంలో రాజకీయంగా బీజేపీని డిఫెన్స్ లో పడేయడం అన్న అంశాలపైనే ప్రగతి భవన్ లో చర్చలన్నీ కేంద్రీకృతమయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల సంవత్సరంలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన అధినేత.. తన కుమార్తెను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి ఎలా రక్షించుకోవాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఎలా అన్న ఆందోళన కూడా పార్టీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది.  

లిక్కర్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లు, అందులో సీబీఐ, ఈడీ లేవనెత్తిన అంశాలు, నిందితులపై మోపిన అభియోగాలు, వీటన్నిటినీ మించి కవితను సీబీఐ గత ఏడాది డిసెంబరు 11న సాక్షిగా ప్రశ్నించడం, ఆ తరువాత సీఆర్పీసీ సెక్షన్ 191 కింద మరో నోటీసు జారీ చేయడం, ఇక అక్కడ నుంచి చార్జిషీట్లలో కవిత పేరును ఈడీ, సీబీఐలు పదేపదే ప్రస్తావిస్తుండటంతో  ఆమెను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఫిక్స్ కేంద్ర ద్యాప్తు సంస్థలు ఫిక్స్ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పైగా కవిత మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఆరోపించడం ఆరోపణలు ఆమెను చిక్కుల్లో పడేశాయని అంటున్నారు. అదీ కాక ఇప్పటికే కవితకు సన్నిహితులుగా చెబుతున్న బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులు అరెస్టు కావడంతో ముందు ముందు కవిత కూడా అరెస్టయ్యే అవకాశాలే ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఒక వేళ అదే జరిగితే ఏకకాలంగా న్యాయపరంగా, పొలిటికల్ గా ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహరచనపైనే ఇప్పుడు సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.