అరెస్టు లేకపోయినా.. అవినాష్ లో ఎందుకీ ఆందోళన, అసహనం?

Publish Date:Feb 24, 2023

Advertisement

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్.. రెండో సారి సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం (ఫిబ్రవరి 24) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సారి అవినాష్ అరెస్టు తథ్యం అంటూ పలు విశ్లేషణలు వెలువడ్డాయి. రాజకీయ పరిశీలకులే కాదు.. వైసీపీ వర్గాలు కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమనే భావించారు.

ఎందుకంటే రెండో సారి విచారణకు రావాలంటూ ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు  పంపిన అనంతరం  సీబీఐ హైకోర్టులో వేసిన ఓ కౌంటర్‌లో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారో పేర్కొన్నారు. ఆ కౌంటర్ కూడా వివేకా హత్య కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేశారు.  దీంతో   సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందనే అంతా భావించారు. అయితే సీబీఐ అవినాష్ ను ఐదు గంటలపాటు ప్రశ్నించి వదిలేసింది. మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పలేదు. ఈ పరిణామం సహజంగా అవినాష్ కు ఎంతో ఊరట కలిగించి ఉండాలి. కానీ సీబీఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డిలో ఆ ఊరట కనిపించలేదు సరికదా.. గతంలో ఎన్నడూ లేనంత ఆందోళన కనిపించింది. ఖంగారు కనిపించింది.

సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదు.. ఏడాది కాలంగా విపక్ష తెలుగుదేశం ఏవైతే ఆరోపణలు చేసిందో వాటికి అనుగుణంగానే సీబీఐ విచారణ, ప్రశ్నలు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐని విపక్ష తెలుగుదేశం మ్యానేజ్ చేస్తోందన్న అర్ధం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. పనిలో పనిగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. దుష్ప్రచారం చేస్తన్న మీడియా బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. అయితే వివేకా ఆందోళన వెనుక, సీబీఐ దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదంటూ చేస్తున్న విమర్శలు, ఆరోపణల వెనుక.. రెండో సారి విచారణలో సీబీఐ ఆయనకు సంధించిన ప్రశ్నలే కారణమని తెలుస్తోంది. తొలి సారి విచారణలో ఆయన తప్పించుకోలేని విధంగా వివేకా హత్య తరువాత ఎవరెవరికి ఫోన్ చేశారన్న దానిపై ప్రశ్నలు సంధించిన సీబీఐ ఈ సారి పూర్తిగా  అవినాష్ ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలపై కాన్ సన్ ట్రేట్ చేసిందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి   కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఆధారంగా  అవినాష్ పై ప్రశ్నల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రశ్నించడంతో అవినాష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారనీ, అందుకే మీడియాతో  మాట్లాడుతూ ఆందోళన, అసహనాన్ని దాచుకోలేకపోయారని అంటున్నారు. ఇప్పటికే లాజికల్ గా ఒక కంక్లూజన్ కు వచ్చేసిన సీబీఐ అరెస్టుల కంటే.. ఈ కేసులో సూత్రధారులను కూడా వెలికి తీయడం అన్న అంశంపైనే దృష్టి పెట్టిందని దర్యాప్తు తీరును పరిశీలిస్తున్న న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కోర్టుకు తెలిపిన వివరాలు, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలనూ గమనిస్తే..  ముందు ముందు మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అందుకే అవినష్ రెడ్డిలో తనను సీబీఐ అరెస్టు చేయలేదన్న ఊరట కనిపించడం లేదని చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.