హ‌రీశ్‌ను తెగ పొగిడేసిన కేసీఆర్.. అంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది?

Publish Date:Feb 23, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ అతిపెద్ద జలాశయం. అనేక వివాదాల నడుమ పూర్తయిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసేఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు హర్షించదగ్గ ఘట్టం ఇదని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నించారని, ఆ కుట్రలను చేధించామన్నారు. ఇంజనీర్లు కూడా భయపడకుండా పనులు చేశారని.. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు. మంత్రి హరీష్ రావును మరీ మరీ పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి, హరీష్ రావు పేరు ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనోనూ హరీష్ రో వినయంగా లేచి నిలబడి, దండాలు పెట్టుకున్నారు. 

ఆలాగే, మల్లన్న సాగర్ ప్రాజెక్టును తెలంగాణ జల హృదయ సాగర్‌ మన్నారు. మల్లన్నసాగర్‌తో మంచినీటి సమస్య పరిష్కారం కావడమే కాకుండా, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. పనిలో పనిగా ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేని పార్టీలు విమరిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే, జాతీయ రాజకీయాల ప్రస్తవన తీసుకొచ్చారు.దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ పేరే కాదు, ప్రాజెక్టుకు అడ్డుపడ్డాయని విమర్శించిన ప్రతిపక్షాల పేరు కూడా తీసుకోలేదు. అంతే కాదు, ప్రతిపక్ష పార్టీల పేరు తెసుకోనని, చెప్పుకొచ్చారు.

అయితే, సుమారు 45 నిముషాల సేపు చేసిన ప్రసంగంలో, ఎక్కడా పెద్దగా కేసీఆర్ మార్క్ కనిపించలేదు. వినిపించలేదు. వేదికేమీద ఉన్నవారే కాదు, కేసేఆర్ ప్రసంగాన్ని టీవీలలో చూసిన వారికి కుడా నిజంగా, మాట్లాదుతోంది కేసేఆరే’నా అనే అనుమానం వచ్చే విధంగా ఆయన స్వరం మారిపోయింది. అందుకే ముఖ్యమంత్రి ప్రసంగం ఆశ్చర్య పరిచే విధంగా  ఉందని అంటున్నారు. మొత్తంగా చూస్తే, కేసీఆర్’ హుజూరాబాద్ షాక్ నుంచి కొంచెం బయట పడినట్లుగా, చాలా వరకు పాజిటివ్ లైన్’లో ఆయన ప్రసంగం సాగింది. అయితే  ఈ మార్పుకు కారణం ఏమిటనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. 

అలాగే, మల్లన్న సాగర్ వేదిక నుంచి కేసేఆర్ చేసిన ప్రసంగంలో ముఖ్యంత్రి ప్రాజెక్ట్  నిర్మాణంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు. కృతజ్ఞలు తెలిపారు. అందరి కంటే, మంత్రి హరీష్ రావును కొంచెం ఎక్కువగా పొగిడారు. అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు వల్లనే ప్రాజెక్ట్ సాకారమైందని  మెచ్చుకున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా హరీష్ రావు కడుపు కట్టుకుని పని చేశారని అన్నారు. కాంట్రాక్టర్లనూ హరీష్ రావు ప్రోత్సహించారని, మరో పొగడ్తను యాడ్ చేశారు.

ముఖ్యమంత్రి, ఇలా హరీష్ రావును అకాశానికి ఎత్తేయడం విషయంలోనూ కొందరు ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు. ఇంకొందఋ అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న రోజుల్లోనే,  కాళేశ్వరం, అలాగే, ముఖ్యమంత్రి తమ ప్రసంగంలో పేర్కొన్నఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. అయినా, 2019 జూన్ 20 న జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్  ప్రారంభోత్సవానికి, హరీష్ రావు కు ఆహ్వానం అందలేదు. ఏపీ సీఎం జగాన్మోహన్ రెడ్డి, మహారాష్ర ఆపత్తి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫండవీస్ ఇతర ప్రముఖులు పాల్గొన్న ఆ కార్యక్రమలో ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి (అప్పటికి అయన మంత్రి కాదు) హరీష్ రావుకు ఆహ్వానం లేదు.   

అప్పట్లో రాజకీయ వర్గాల్లో అదొక చర్చనీయాంశమైంది. హరీష్ రావు ఎక్కడ? అని విపక్షాలు ప్రశ్నించాయి. ఎక్కిరించాయి. అవహేళన చేశాయి. మీడియాలో చర్చలు జరరిగాయి. హరీష్ రావు కూడా బావోద్వేగానికి గురయ్యారని’ కన్నీళ్ళు పెట్టుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. అఫ్కోర్స్, హరీష్ ఎక్కడా బహిరంగంగా తమ బాధను వ్యక్తం చేయలేదు.. అయినా.. ఆరోజు .. ఆయన బాధపడి ఉంటారు, అందులో సందేహం లేదు. నిజానికి అదిప్పుడు విషయం కాదు ,కానీ, అప్పుడు అలా అవమానించిన కేసీఆర్ .. ఇప్పడు ఇలా నెత్తికి ఎత్తుకోవడం.. లో మర్మమేంటి .. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగతునం చర్చ ..దాల్ మే కుచ్ కాలా హై క్యా ...?

By
en-us Political News

  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.