కవితకు అండగా తెరపైకి కేటీఆర్

Publish Date:Mar 9, 2023

Advertisement

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై ఇంతవరకు పెదవి విప్పని మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, ఎట్టకేలకు పెదవి విప్పారు. నిజానికి, ఇంచు మించుగా ఆరేడు నెలలుగా ఢిల్లీ మద్యం కుంభ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ప్రతి చార్జి షీట్ లోనూ ఆమె పేరు ఒకటికి పది సార్లు ప్రస్తావనకు వస్తూనే వుంది. ముద్దాయిగా ఆమె పేరు చేర్చలేదు అనే గానీ, కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఉచ్చులు బిగుస్తున్నాయి. అయినా  ఇంతవరకు ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కల్వకుట్ల కుటుంబంలో ఎవరూ  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు గురించి ఒక్క మాట మాటలాడలేదు. ఇప్పుడు ఈడీ సమాన్లు జారీ చేసి, ఆమె అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తున్న సంకేతాలు అందుతున్న సమయంలో కేటీఆర్ చెల్లెలికి మద్దతుగా తెర మీదకు వచ్చారు. 

అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం గురించో, అందులో కవిత పాత్రకు సంబంధించి వస్తున్న ఆరోపణల గురించో కాకుండా, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. కవితకు సమన్లు జారీ చేసింది ఈడీ  కాదు మోడీ అంటూ విరుచుకు పట్టారు. దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై  ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చారన్నారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో  దర్యాప్తు  సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని  కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు.  దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు  బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.

  గురువారం(మార్చి 9) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన లిక్కర్ స్కాంలో కవితకు.. ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ప్రస్తావించారు. మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క కవితకే కాదని.. 10, 12 మంది బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశాయన్నారు. కవిత మొదటిది కాదు.. చివరిది కాదని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు దాడులు చాలా జరుగుతాయన్నారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. 

అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని విమర్శించడం వలన రాజకీయంగా కేటీఆర్ కు ఏదైనా మేలు జరిగితే జరగవచ్చును కానీ, మోడీపై కేటీఆర్ చేసిన విమర్శలు  విచారణ ఎదుర్కుంటున్న కవితకు ఏ విధంగాను మేలు చేయక పోగా, సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదముందని, అంటున్నారు.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.