Publish Date:Jun 11, 2025
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వెంట ఈ విచారణకు వచ్చేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కమిషన్ అనుమతించింది. ఇలా ఉండగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి బయలుదేరుతుండగా ఎర్రవల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కాలు జారి పడిపోయి గాయపడ్డారు. దీంతో ఆయనను సికిందరా బాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఈ అపశ్రుతులేంటంటూ బీఆర్ఎస్ శ్రేణులు మధనపడుతున్నాయి.
కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో బీఆర్క్కే భవన్ కు వచ్చే దారులలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బీఆర్కు భవన్ లోకి అందులో పని చేసే ఉద్యోగులను వినా మరెవరినీ అనుమతించడం లేదు. అలాగు బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని పూర్తిగా మూసి వేశారు.
ఇలా ఉండగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడానికి ముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు నిలబెడితే ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని పేర్కొన్న కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పటి ఫోటోను ఆ పోస్టుకు జత చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-attend-before-kaleswaram-commission-39-199696.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.