6న అసెంబ్లీ రద్దు.. టీఆర్ఎస్దే గెలుపు
Publish Date:Aug 25, 2018
Advertisement
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశం జరిగింది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సెప్టెంబరు 2న తలపెట్టిన ప్రగతి నివేదన సభ, ఎన్నికలు, అభ్యర్థులు సహా వివిధ అంశాలపై మాట్లాడారు.. ‘పత్రికల్లో ముందస్తు, గిందస్తు అని రాస్తున్నారు.. అవన్నీ పట్టించుకోకండి.. ఎన్నికల సంగతి నాకు వదిలిపెట్టండి.. నేను చూసుకుంటాను.. ఎన్నికలు మూడు నెలల్లో రావచ్చు, ఆరు నెలల్లో రావచ్చు.. ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’ అని స్పష్టం చేశారు. 'ఇప్పటికే 14 సర్వేలు చేయించాను.. అన్నింట్లో మనదే అధికారమని తేలింది.. 101 సీట్లు పక్కా గెలుస్తాం.. 70 శాతం ఓట్లతో గెలిచే స్థానాలు 17 ఉన్నాయి.. 60 శాతం ఓట్లతో 50కుపైగా గెలుస్తాం.. 5 వేల నుంచి 10 వేల మెజారిటీతో గెలిచే సీట్లు నాలుగైదు ఉన్నాయి' అని తెలిపారు.. 'వచ్చే ఎన్నికలకు చాలామంది సిట్టింగులను మారుస్తామని ప్రచారం జరుగుతోంది.. అది కరెక్ట్ కాదు.. సిటింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం.. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దు.. అయితే, ముగ్గురు, నలుగురు సిటింగ్ల పరిస్థితి స్థానికంగా ఇబ్బందికరంగా ఉంది.. తిరిగి టికెట్లు ఇవ్వకుండా వారిని తప్పించినా దూరం చేసుకోబోం.. ఎమ్మెల్సీ, ఇతర సమానమైన పదవులు ఇచ్చి గౌరవప్రదంగా చూసుకుంటాను’ అని భరోసా ఇచ్చారు. అదే విధంగా ప్రగతి నివేదన సభకు 20-25 లక్షలకు తగ్గకుండా జనం రావాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ ఉండాలని, ఇందుకు అవసరమైన జన సమీకరణ చేయాలని సూచించారు.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20-25 వేల జనాన్ని తీసుకురావాలని చెప్పారు.. మరోవైపు సెప్టెంబరు 6వ తేదీన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు తెలుస్తోంది.. ఇదే జరిగితే డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. చూద్దాం మరి ఏం జరుగుంతుందో.
http://www.teluguone.com/news/content/kcr-alerts-party-mlas-and-mps-over-early-elections-39-83248.html





