Publish Date:Mar 27, 2026
కల్వకుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా. అలా తన తండ్రి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించగా.. కూతురు కవిత, పాతికేళ్ల తర్వాత.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్రకటనకు సుముహుర్తం ఎంపిక చేసినట్టు ప్రకటించారు.ఇంతకీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి అనే సామాజిక సంస్థను నడుపుతున్నారు. దీనికే ప్రజా అనే పదం చేర్చుతూ దాన్ని రాజకీయ పార్టీగా మార్చుతున్నట్టు కనిపిస్తోంది.
ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో పరిశీలిస్తే.. ధర్మ గంటను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జెండా, అజెండా ఎలాంటివో గమనిస్తే ఇప్పటికే జాగ్రత్తికంటూ తెలుపు, లేత పచ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ ఫస్ట్.. ఆమె తీసుకున్న రాజకీయ విధానంగా సమాచారం. ఇక యువత, మహిళలు, అణగారిన వర్గాల హక్కులు, మరీ ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడ్డం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక బీసీ సంగతి సరే సరి. మహిళల రిజర్వేషన్లపై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటికల్ లైన్లలో భాగమే.
వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్లో భాగంగా తెలంగాణ నియోజకవర్గాలు సైతం పెరగనుండటంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎందరో కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొచ్చేలా తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం ఖరారు చేయడం వెనక ఉన్న ఉద్దేశమేంటో పరిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర పరమైన అంశాలు ఇందులో దాగి ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ ఇరవై ఐదున రాజయోగాన్నిచ్చే గ్రహగతుల సంచారం కనిపిస్తోందని అంటారు పండితులు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సుదినంగా చెబుతున్నారు.
దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించారు కవిత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్రజా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ తనయ కవిత. ఆ పార్టీ ఆనాడు ఎంతగా ఎదిగిందో, తన పార్టీ కూడా అంతేలా ఎదుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు కవిత. ఉగాది తర్వాత వచ్చే శ్రీరామనవమి వేడుకల అనంతరం తన పార్టీ జెండా ఎగురవేయడం ద్వారా.. ప్రజల్లోకి బలంగా వెళ్లవచ్చన్న నమ్మకాలు కూడా కవితకు ఉన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అలాంటి వారికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని అంటున్నారు కవిత. ఇక చట్టసభల్లో మహిళా సాధికారతను తీసుకొచ్చేలా 33 శాతం రిజర్వేషన్లకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రత్యేకించీ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు.. నిరుద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటం కూడా కవిత తన విధానంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కవిత పార్టీ ఎఫెక్ట్ ఎంత? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే ఎదిగే అవకాశం ఎంత? దక్షిణాది నుంచి జయ తర్వాత ఆ స్థాయిలో ఒక మహిళగా ఆమె రాజకీయంగా ఎదిగి సీఎం కాగలరా? తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavithas-new-party-launching-on-april-25th-25-216294.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.