ముసుగులు తొలగిపోతున్నాయా?

Publish Date:Dec 12, 2023

Advertisement

బీఆర్ఎస్, బీజేపీ జుగల్ బందీ విషయంలో ఇక దాపరికం అక్కర్లేదనుకున్నారా? వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క సారి ఓడిపోగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు దాసోహం అంటోందా? ఆ పార్టీకి అటువంటి సంకేతాలే ఇస్తోందా? వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  రాష్ట్రం నుంచి లోక్ సభ స్థానాల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తామని చెప్పకనే చెబుతోందా?  అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ఒక ట్వీట్ ఔననే సమాధానమే వచ్చేలా చేస్తోంది.

ఔను అయోధ్య రామమందిరంపై కవిత చేసిన ట్వీట్ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది.  అయోధ్యలో సీతారామచంద్ర స్వామి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో తెలంగాణతోపాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అంటూ కవిత చేసిన ఒక్క ట్వీట్ బీఆర్ఎస్ బీజేపీల జుగల్ బందీని తేటతెల్లం చేసింది.  ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో ఉన్న తరుణంలో కవిత చేసిన తాజా ట్వీట్ దానిని ధృవీకరించేలా ఉంది. బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెట్టి మళ్లీ అధికారంలోకి రావడమే బీఆర్ఎస్ టార్గెట్. అంటే బీఆర్ఎస్, బీజేపీల టార్గెట్ కాంగ్రెస్. ఆ లక్ష్య సాధన కోసమే.. తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ఆ రెండు పార్టీలూ ఎన్నో వ్యూహాలు పన్నాయి. ఎత్తులు వేశాయి. ఒక దశలో రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం బీజేపీయే తప్ప కాంగ్రెస్ కాదని కేసీఆర్ బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. సరే అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీల వ్యూహాలు, ఎత్తులూ బెడిసి కొట్టి కాంగ్రెస్  అధికారంలోకి వచ్చింది.

అది పక్కన పెడితే.. ఇక నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలోనైనా కాంగ్రెస్ కు చెక్ పెట్టి, రాష్ట్రంలో జమిలిగా బలోపేతం కావాలన్న వ్యూహంలో భాగంగానే  కవిత రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనపై ట్వీట్ చేశారన్న చర్చ జోరందుకుంది.   ఈ రెండు పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లేందుకు ఈ ట్వీట్ తొలి అడుగు అంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.