కవిత బీఆర్ఎస్.. వైసీపీలో గుబులు, తెలుగుదేశం కూటమిలో జోష్!.. ఎందుకంటే?

Publish Date:May 2, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది. 

అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.  

అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు. 

ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.