Publish Date:Nov 27, 2025
బీఆర్ఎస్ బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయన్న విషయంలో రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తన గులాబి రంగును కాషాయంగా మార్చుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన కల్వకుంట్ల కవిత.. తాను స్వయంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ కూడా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు టార్గెట్ గా ఉంటున్నాయి. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చేవిగానే ఆమె వ్యాఖ్యలు విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారా అన్న అనుమానాలూ కలిగించేలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఆ సందర్భంగా ఆమె ధరించిన చీర ఆమె కాంగ్రెస్ బాట పట్టారా అన్న అనుమానాలకు బలం చేకూర్చాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం (నవంబర్ 26) జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన కవిత కాంగ్రెస్ పార్టీ రంగులు ఉన్న చీరను కవిత కట్టుకట్టుకోవడమే తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చకు తావిచ్చింది. కవిత సాధారణంగా పబ్లిక్ ఈవెంట్లకు హాజరయ్యే సందర్భాలలో సింపుల్ రంగులు ఉండే చీరలనే ధరిస్తారు. అయితే మల్లు భట్టివిక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాత్రం కవిత ఎరుపు, ఆకుపచ్చ అంచులున్న తెల్లటి చీర ధరించి రావడం అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది.
ఆమె అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయన్న అభిప్రాయం కలిగేందుకు తావిచ్చింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి, ఆ పార్టీ గద్దెలు కూల్చండి అంటూ పిలుపునిచ్చిన కవిత గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉపముఖ్యమంత్రి అయిన భట్టి ఇంట్లో ఓ వేడుకకు కాంగ్రెస్ రంగులున్న చీర ధరించి మరీ హాజరు కావడంపై నెటిజనులు ఓ లెవల్ లో కామెంట్లు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-saree-spark-political-debate-39-210104.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.