తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. తండ్రికి రాసిన లేఖ లీక్ తరువాత జరిగిన పరిణామాలు ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడం ఖాయమన్న సంకేతాలనే ఇస్తున్నాయి. ఇప్పటికే ఆమె తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన, ప్రమేయం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఆమె ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఎక్కడా బీఆర్ఎస్ పేరు కానీ, బీఆర్ఎస్ జెండా కానీ లేదు. అయితే కేసీఆర్, జయశంకర్ ఫొటోలు మాత్రం ప్రముఖంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె తాజాగా ప్రారంభించిన జాగృతి కార్యాలయమే ఒక వేళ ఆమె రాజకీయ పార్టీ ప్రారంభిస్తే.. ఆ పార్టీ కార్యాలయంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో కవిత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.
అయితే ఇక్కడే ఒక సందేహాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కవిత బీఆర్ఎస్ కు దూరంగా వేస్తున్న రాజకీయ అడుగుల వెనుక ఆమె తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఉందా అన్నదే అ సందేహం. మామూలుగా అయితే కవిత తీరు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ కు స్పష్టమైన హెచ్చరికగానే భావించాల్సి ఉంటుంది. ఆమె బాహాటంగానే తన సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో కేసీఆర్ ను దేవుడిగా అభివర్ణించారు.
ఇప్పుడు కవిత తన సొంత పార్టీని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? తమిళనాడులో డీఎంకే, ఏఐఏడిఎంకేలా బీఆర్ఎస్ రెండుగా నిట్టనిలువుగా చీలిపోతుందా? బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలను కవిత తన వైపునకు తిప్పుకోగలరా? అంటే ఆమెకు అంత సీన్ లేదన్న సమాధానమే అన్ని వర్గాల నుంచీ వస్తోంది. అయితే తమిళనాడులో డీఎంకే అన్నాడీఎంకేలు ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు అవకాశం, చోటు లేకుండా చేశాయి. ఇప్పుడు కవిత వేరుకుంపటి కూడా అలాంటి వాతావరణం సృష్టించడానికేనా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అదే కారణమై ఉంటే మాత్రం కవిత అడుగుల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి దానిని నిర్వహించేంత స్థాయి కవితకు లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ యోచన, ప్రయత్నాల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-kalvakuntla-political-steps-kar-strategy-39-199138.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.