కాంగ్రెస్ గూటికి  క‌విత‌!

Publish Date:Oct 17, 2022

Advertisement

తెలంగాణా రాజ‌కీయాల ప‌రిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్‌గా మారిపోయింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి దూకి కేంద్రానికి గ‌ట్టి స‌వాలు విసిరి త‌న ప్రాధా న్య‌త‌ను దేశ‌మంతా విస్త‌రించేలా చేయ‌డానికి ముంద‌డుగు వేశారు. అయితే ఈ స‌మ‌యంలోనే ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ‌టం, అందులో కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట క‌విత త‌దిత‌రుల కీల‌క‌పాత్ర గురించి వార్త‌లు దేశ‌మంత‌టా విస్త‌రించ‌డం ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించు కుంది. ఆమె పాత్ర ఎంత‌వ‌ర‌కూ ఉంది, అది కేసీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది తెలంగాణా రాజ‌కీయాల్లో త‌న దైన శైలితో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న, కేసీఆర్ సోద‌రుని కుమార్తె తెలంగాణా ఫైర్‌బ్రాండ్ ర‌మ్యారావు,  క‌విత కాంగ్రెస్  ఆశ్ర‌యించ‌డానికే ఎంతో అవ‌కాశం ఉంద‌న్నారు. ఆమె కాంగ్రెస్‌తో లోపాయ కారి ఒప్పందాలు చాలాకాలం క్రిత‌మే చేసుకుంద‌ని అన్నారు. 

శ‌నివారం తెలుగువ‌న్‌తో ర‌మ్యారావు ప్ర‌స్తుత రాజ‌కీయాప‌రిణామాల‌గురించి చ‌ర్చించారు. ఈ సంద‌ ర్భంగా ఆమె మాట్లాడుతూ, అస‌లు తెలంగాణాలో టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చే స‌మ‌యానికే క‌విత బీజేపీ వారితో సంబంధాలు ప‌టిష్ట‌ప‌రుచుకుంద‌ని ర‌మ్యారావు అన్నారు.  రెండో పర్యాయం టీ ఆర్ ఎస్‌ రాకున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నార‌న్నారు. అం దువ‌ల్ల‌నే ఆమె ఎంపీగా గెలిచిన నిజామా బాద్ నుంచే మ‌ళ్లీ పోటీచేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇక్క డ త‌మ పార్టీ రాకున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో ఉన్న స‌త్సంబంధాలు క‌విత‌కు మ‌ద్ద‌తునిస్తాయన్న ధైర్యం ఆమెకు  ఎప్ప‌టి నుం చో ఉంద‌న్నారు. అప్ప‌ట్లో అమిత్ షా ని మ‌రో కీల‌క నాయ‌కునితో సంప్ర దించార‌ని, త‌మ స్థానం సు స్థిరప‌ర‌చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని  ర‌మ్యారావు  స్ప‌ష్టం చేశారు.  

లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌స్తావిస్తూ, మ‌రీ విస్త‌రించేంత‌వ‌ర‌కూ వాస్త‌వానికి కేసీఆర్‌కు తెలియ ద‌ని, దాని సీరియ‌స్ నెస్ బ‌య‌ట‌ప‌డ‌డంతో కుమార్తెను ఆ ఉచ్చునుంచి బ‌య‌ట‌ప‌డేసేటందుకు ఆయ‌న తీవ్ర కృషిచేస్తున్నార‌ని ర‌మ్యారావు అన్నారు. ఢిల్లీలో నాయ‌కుల‌ను సంప్ర‌దించి కేసు తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారన్నారు. అయితే మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌ మ‌యిన ఈ స‌మయంలో కేసు ప్ర‌భావం ఉంటుంద‌ని అంటూనే తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే ప‌రువు కాపాడు కునే య‌త్నా ల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి క‌విత పాత్ర కీల‌క‌మా కాదా అన్న‌ది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంద‌ని, అయితే ఈసీ ఏసి బీ దాడుల‌తో ఆమె చుట్టూ కేసు బిగియ‌డం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ  క‌విత స‌న్నిహితుడు అప్రోవ‌ల్‌గా మారితేనే ఆమెకు ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చుగాని అప్ప‌టివర‌కూ ఉండ ద‌న్నారు. 

అయితే క‌విత నేరుగా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ని సంప్ర‌తించార‌ని, ఆయ‌న ఆమెను స్కామ్ నుంచి ర‌క్షిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ని ర‌మ్యారావు అన్నారు. అంచేత కేసీఆర్ ప్ర‌య‌త్నాల కంటే మోహ న్ భ‌గ‌వ‌త్ క‌రుణాక‌టాక్షాలే ఆమెను కాపాడ‌తాయ‌న్నారు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ కేంద్రం మీద భారీ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో అదెంత‌వ‌ర‌కూ సాధ్య మ‌న్న ప్ర‌శ్న‌క స‌మాధానం చెబుతూ, మునుగోడు ఎన్నిక‌ల ముందు పార్టీ ఇబ్బందిప‌డ‌కుండా బీజేపీ వారు కూడా జాగ్ర త్త‌లు తీసుకుంటార‌ని, ఆమెపై చ‌ర్య‌కు ఉప‌క్ర‌మిస్తే మునుగోడులో సెంటిమెంట్ మీద టీఆర్ ఎస్ గెలిచే అవ‌కాశాలుంటాయి గ‌నుక టీఆర్ ఎస్‌పై దాడి అంత వేడిగా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. ప‌రిస్థితుల‌ను అను స‌రించే అంతా జ‌రిగిపోతుందే త‌ప్ప వెంట‌నే చ‌ర్య‌ల‌కు దిగితే కేంద్రం కూడా చిక్కుల్లో ప‌డుతుంద‌నే వారు ఆలోచిస్తారన్నారు. 

కేటీఆర్‌, కేసీఆర్ ల మ‌ధ్య విభేదాల గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, అలాంటిదేమీ లేద‌ని, అసెంబ్లీకి ఎవ‌రు ముందు రావాలి, ఎవ‌రు త‌ర్వాత రావాల‌న్న‌దేమీ ఉండ‌ద‌ని, పైగా ఒక‌రు లేని స‌మ‌యంలో మ‌రొక‌రు రావ‌డం అనేది ఉండ‌ద‌న్నారు. విభేదాల‌కు ఆస్కారం లేద‌ని, కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు కేటీఆర్‌ను ఇక్క‌డ ముఖ్య‌మంత్రి చేసి పార్టీ బాధ్య‌త‌ను పూర్తిగా ఆయ‌న చేతుల్లో పెట్టే యోచ‌న‌లో ఉన్న‌పుడు విబేదాల‌కు ఆస్కారం ఉండ‌దని ర‌మ్యా రావు అన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదు ర్కొన‌డానికి ప్ర‌తిప‌క్షాల‌తో స్నేహ‌సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకుని యుద్ధానికి స‌న్న‌ధ్ద‌మ‌వుతున్నార‌నే అనాలి. అలా ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తో క‌లిసి ఇక్క‌డ త‌న కుమారుడు కేటీఆర్ కు ఎలాంటి ఎదురుదాడి లేకుండా చేసుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గింప చేయ‌వ‌చ్చు. ఫ‌లితంగా తెలంగాణాలో బీఆర్ ఎస్‌, కేటీఆర్ ప్ర‌భుత్వానికి అడ్డంకులు ఉండ కుండా పోతా య‌న్న‌ది ఆయ‌న వ్యూహంలో భాగం కావ‌చ్చున‌న్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.