జక్కన్న నాటిన మొక్క..
Publish Date:Jul 24, 2018
Advertisement
వృక్షో రక్షిత రక్షితః అన్నారు పెద్దలు.మనం ఓ చెట్టు అయితే తేలిగ్గా నరకగలం కానీ ఓ విత్తు విత్తితే అది మొక్కై చెట్టుగా మారటానికి చాలా కాలం పడుతుంది.ఓ చెట్టు మనల్ని మన చుట్టూ ఉండే జీవరాసుల మనుగడని కాపాడుతుంది.అందుకే వీలైతే ఓ మొక్క నాటలిగాని నాశనం చేయకూడదు.అయితే ఈ నెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ ‘హరితహారం’లో భాగంగా గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రీన్ చాలెంజ్ అంటే మనం మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తే వారు తలా మూడు మొక్కలు నాటి తలా ముగ్గురికి ఛాలెంజ్ విసరాలి.ఇది ఒక రిపీటెడ్ చైన్ ప్రాసెస్. దీనిలో భాగంగా హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కవిత.. తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆమె రాజమౌళి సహా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసిరారు.అయితే తాజాగా ఎంపీ కవిత విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన రాజమౌళి.. తన ఫామ్ హౌస్లో మర్రి చెట్టు, గుల్మొహర్ చెట్టు, నిమ్మ చెట్టు లను నాటారు. అనంతరం పుల్లెల గోపీచంద్, మంత్రి కేటీఆర్, యంగ్ డైరెక్టర్స్ సందీప్ వంగా, నాగ అశ్విన్లకు ‘హరితహారం’ గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు జక్కన్న. ఈ మేరకు ట్వీట్ చేస్తూ తాను మొక్క నాటుతున్న ఫొటో జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పర్యావరణ ప్రేమికులు ఈ కార్యకమం ద్వారా అయినా అందరు చైతన్యవంతులు అవుతారని ఆశిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kavitha-challenges-rajamouli-39-82718.html





